Bigg Boss: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమము ఒకటి. ఈ కార్యక్రమం తెలుగులో ఏడు సీజన్ల పూర్తి అయ్యాయి. త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ మొదటి వారంలో ఉండబోతుందని తెలుస్తుంది. ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగో ప్రోమో కూడా విడుదలైన సంగతి తెలిసిందే.

ఇక ఈ కార్యక్రమానికి ప్రారంభం కాబోతుందని విషయం తెలియడంతో ఎంతో మంది ఈ కార్యక్రమం పై ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పేర్లలో వేణు స్వామి పేరు కూడా వినపడుతుంది.
ఇలా వేణు స్వామి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు ఇదే ప్రశ్న ఎదురయింది. బిగ్ బాస్ కార్యక్రమానికి మీరు వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. నిజమేనా స్వామి అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ బిగ్ బాస్ కార్యక్రమానికి రావాలని గత కొన్ని సీజన్లో నుంచి నన్ను పిలుస్తున్నారు కానీ నేను వెళ్లలేదు.
వెళ్తే ఓడిపోతారా..
నాకు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లడం ఇష్టం ఉండదు అదొక చెత్త షో. ఈ కార్యక్రమంలోకి వెళ్లి విజేతలుగా వచ్చిన వారందరూ రెచ్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక ఈ కార్యక్రమానికి వెళ్లి ఎంతో మంది జీవితాలను కూడా నాశనం చేసుకున్నారు. అందుకే ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లొద్దని నేను చాలామందికి చెబుతుంటాను అలాంటిది నేనేలా వెళ్తానని తెలిపారు. ఇలా ఈయన వెళ్లలేదని క్లారిటీ ఇచ్చినప్పటికి కొంతమంది మీ జాతకంలో మీరు ఓడిపోతారని ఉందా అందుకే వెళ్లలేదా అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
































