Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.
రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































