YS Jagan: ఏపీ ఎన్నికల అనంతరం కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలపై పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ కేసులను నమోదు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ జగన్ మోహన్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.

జగన్‌తో పాటు అప్పటి సీఐడీ డీజీ సునీల్ కుమార్ పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో వైయస్ జగన్ ఆదేశాల మేరకే నన్ను అరెస్టు చేశారని అదే విధంగా కస్టడీలో ఉన్నటువంటి తనపై హత్యాయత్నం చేశారని రఘురామ కృష్ణరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రబ్బర్ బెల్ట్, లాఠీలతో కొట్టారని ఫిర్యాదులో రఘురామ పేర్కొన్నారు.
అప్పటి సీఎం జగన్ ఒత్తిడితోనే 2021 మే 14న తనను సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టారని ఈయన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ కేసులో మాజీ సీఎం జగన్ ఏ3గా ఉన్నారు. ఏ1గా సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్, ఏ2గా ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు, ఏ4గా విజయపాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతిలను పోలీసులు చేర్చారు.
కొట్టివేసిన కేసుపై ఎఫ్ ఐ ఆర్..
ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారడంతో ఏవన్ గా ఉన్నటువంటి సిఐడి మాజీ డిజి సునీల్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసు గురించి కోర్టు మూడు సంవత్సరాల క్రితమే ఈ పిటీషన్ ని కొట్టి వేసింది తిరిగి ఈ కేసు గురించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అంటే ఏంటో అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ సునీల్ కుమార్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి ఈ ట్వీట్ పై రఘురామకృష్ణం రాజు స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.





























