Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.
యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































