సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కొడుకు ఎవరో మీకు తెలుసా.?

0
648

కైకాల సత్యనారాయణ.. 45 సంవత్సరాలుగా తెలుగు చిత్ర రంగానికి సేవ చేస్తున్న తెలుగు సినీ నటుడు, మాజీ భారత పార్లమెంటు సభ్యుడు. ఇప్పటి వరకూ 777కు పైగా చిత్రాలలో నటించాడు. ఒక నటుడిగా పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలన్నిటిలోనూ నటించి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. నాటి తరం హీరోగా, కమెడియన్ గా, విలన్ గా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించాడు. తాను పోషించిన వైవిద్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన ‘నవరస నటనా సార్వభౌమ’ అనే బిరుదును కూడా సంపాదించుకున్నాడు.

కైకాల సత్యనారాయణ కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో, కైకాల లక్ష్మీ నారాయణకు 1935 జూలై 25 న జన్మించాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయ వాడలలో పూర్తిచేసిన కైకాల.. గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. 1960 ఏప్రిల్ 10 న నాగేశ్వరమ్మతో పెళ్ళైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళతో పాటు ఇద్దరు కొడుకులు కూడా వున్నారు. తన గంభీరమైన భారీ కాయంతో, కంచు కంఠంతో, సినిమాల్లో వేషాల కోసం సత్యనారాయణ చెన్నైలో ఆడుగు పెట్టిన క్రొత్తలో ఆయన నటనా ప్రతిభను మొదట గుర్తించింది D.L. నారాయణ. 1959 లో నారాయణ ‘సిపాయి కూతురు’ అనే చిత్రంలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చాడు. ఆ చిత్ర దర్శకుడైన చంగయ్య ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. అలా గుర్తించటానికి గల కారణమేమిటంటే.. ఆయన రూపు రేఖలు అచ్చం ఆనాటి అగ్రహీరో NTR ను పోలి ఉండటమే.! సరిగ్గా అదే టైమ్ లో NTR కూడ సత్యనారాయణను గమనించారు.

1960లో NTR తన ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ చిత్రంలో ఈయనకి ఒక పాత్రనిచ్చారు. ఈ చిత్రంలో సత్యనారాయణ యువరాజు పాత్రలో నటించాడు. ఆ విధంగా సత్యనారాయణను ఒక విలన్ గా చిత్రీకరించవచ్చునని కనిపెట్టినది విఠలాచార్య. ఆ ఒక్క నిర్ణయం సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య సత్యనారాయణతో విలన్ గా ‘కనక దుర్గ పూజా మహిమ’ చిత్రంలో అవకాశమిచ్చాడు. ఆ పాత్రలో సత్యనారాయణ కరెక్ట్ గా సెట్ కావడటంతో, ఆ తర్వాత చిత్రాలలో కూడా ఆయన విలన్ గానే స్థిరపడిపోయాడు. విలన్ గా తన సినిమా యాత్రను కొనసాగిస్తూనే, సత్యనారాయణ అప్పుడప్పుడు కారెక్టర్ పాత్రల్లో కూడా నటించారు. ఆ పాత్రలతోనే ఆయన సంపూర్ణ నటుడిగా నిరూపించుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ లాంటి ఒక విలక్షణ నటుడు దొరకటం నిజంగా అదృష్టమనే చెప్పాలి. కైకాల సత్యనారాయణ టాలీవుడ్ లో నటించని పాత్ర అంటూ లేదు. ఆయన ఏపాత్ర వేసినా ఆ పాత్రలో జీవించేవాడు.

యమగోల మరియు యమలీల చిత్రాల్లో యముడిగా నటించిన సత్యనారాయణ ప్రేక్షకులందరినీ అలరించాడు. వెండితెరపై కృష్ణుడిగా, రాముడిగా అలనాటి NTR ఎలాగో, యముడిగా సత్యనారాయణ అలా నటించాడు. ప్రముఖ సీనియర్ నటుడు S.v. రంగారావు ధరించిన పాత్రలన్నీ ఆయన తదనంతరం చాలావరకు సత్యనారాయణయే పోషించాడు. పౌరాణికాల్లో రావణుడు, యముడు, దుర్యోధనుడు, ఘటోత్కచుడు వంటి సాంఘిక చిత్రాలలో రౌడీ పాత్రలు, కథానాయిక తండ్రి, హీరోయిన్ తాత మొదలైన పాత్రలన్నిటికీ ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్ కైకాల సత్యనారాయణ అనేంత గుర్తింపును నేటికీ సంపాదించిన ఈయన కుమారుడు మన టాలీవుడ్ లో ఎన్నో సంచలనమైన విజయాలను సాధించిన సినిమాలకు నిర్మాతగా పని చేసాడు అన్న సంగతి మీకు తెలిస్తే నిజంగానే షాకవుతారు. వివరాల్లోకి వెళ్తే..

మన దక్షిణాది సినీ పరిశ్రమ గర్వపడే సినిమాలలో ఒక్కటి K.G.F. కన్నడ నటుడు, రాకింగ్ స్టార్ యాష్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. ఈ చిత్రానికి కన్నడలో సహా నిర్మాతగా పని చేసిన కైకాల సత్య నారాయణ కుమారుడు, తెలుగులో ఈ చిత్రానికి సంబంధించిన సర్వ హక్కులు తానే తీసుకొని టాలీవుడ్ లో విడుదల చేసి కాసుల వర్షం కురిపించుకున్నాడు. ఈవిధంగా ఒక్క టాలీవుడ్ లోనే ఈ సినిమా సుమారు 18 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసిందంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఈ చిత్రం తర్వాత ఆయన వెంటనే ‘K.G.F చాప్టర్ 2’ కి కూడా కన్నడలో సహా నిర్మాతగా పని చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం టాలీవుడ్ లో బాగా పేరున్న నిర్మాతలు కొందరూ ప్రయత్నిస్తున్న టైమ్ లో చివరిగా ఆ చిత్రం కాపీరైట్స్ కైకాల సత్యనారాయణ కి మాత్రమే దక్కాయి. భవిష్యత్తులో కైకాల సత్యనారాయణ కొడుకు టాలీవుడ్ లోని సూపర్ స్టార్స్ అందరితోనూ సినిమాలు తియ్యడానికి సిద్ధమౌతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here