టేస్టీ వెజ్ రోల్ ఎలా తయారు చేయాలో చూద్దాం…!

    0
    2579

    ముందుగా కావలసిన పదార్థాలు:

    • గోధుమ పిండి – 3 చపాతీలా కు సరిపడా( చపాతీలు చేసి సిద్దం చేసుకోవాలి)
    • కాప్సికం – 2 కాలీఫ్లవర్ తరుగు – పావు కప్పు
    • టమోటో ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు
    • ఉల్లిపాయలు – 2 ( చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి)
    • పచ్చి మిర్చి – 3 ( సన్నగా తరిగిన వి)
    • మిరియాల పొడి – అర టీ స్పూను
    • జీలకర్ర పొడి – 1 టీ స్పూను
    • పసుపు – అర టీ స్పూను
    • టమోటో సాస్ – 5 టేబుల్ స్పూన్లు
    • ఉప్పు – తగినంత
    • నూనె – సరిపడా

    తయారీ విధానం:

    మొదట స్టవ్ ఆన్ చేసుకొని నూనె వేడి కాగానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి దోరగా వేయించుకోవాలి, తర్వాత కాప్సికం, టమోటో ముక్కలను వేసుకొని గరిటె తో తిప్పుతూ బాగా దగ్గర పడేలా వేయించుకోవాలి, అవసరమైతే కాస్త నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. చివరగా పసుపు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, టమోటో సాస్ వేసి గరిటె తో తిప్పుతూ బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీలను పెనంపై కాల్చుకొని, కాలీఫ్లవర్ మిశ్రమం వేడిగా ఉన్నపుడే చపాతీ పై నిలువుగా ఒక వైపు వేసుకొని రోల్స్ లా చుట్టుకోవాలి. తర్వాత కావాల్సిన సైజులో వాటిని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు..