అనుపమ పరమేశ్వరన్‌లో ఉన్న మైనస్‌లు ఇవే.. అందుకే కెరీర్ దెబ్బైపోయిందా..?

0
4351

ప్రేమమ్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. దీంతో అనుపమకి మలయాళ సినిమా జేమ్స్ & అలైస్ లో అవకాశం దక్కింది. ఈ రెండు సినిమాల తరువాత తెలుగులో స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అ… ఆ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. నితిన్ సమంత జంటగా నటించిన సినిమాలో అనుపమ సెకండ్ లీడ్ క్యారెక్టర్ చేసింది. నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర అయినా కూడా బాగానే ఆకట్టుకుంది.

అలాగే మలయాళం నుండి తెలుగులోనికి రీమేక్ చేసిన ప్రేమమ్ సినిమాలో నాగ చైతన్య సరసన నటించింది. దాంతో ఏకంగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అనుపమకి అవకాశం ఇచ్చాడు. 2017 జనవరి నెలలో విడుదలైన శతమానం భవతి సినిమాలో శర్వానంద్‌తో జంటగా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో తెలుగులో వరుసగా సినిమాలకి సైన్ చేసింది. తెలుగులో సినిమాలు చేస్తూనే ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘కోడి’లో నటించింది. ఈ సినిమా అనుపమ మొదటి తమిళ సినిమా.

అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ మలయాళ సినిమా “జొమొంతె సువిశేషంగళ్” అనే సినిమాలోనూ నటించింది. ఇందులో మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. ఈ సినిమా తెలుగులో “అందమైన జీవితం” అనే పేరుతో డబ్  అయింది. ఇక 2017 అక్టోబరులో విడుదలైన ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమాలో రామ్‌ పోతినేని సరసన నటించింది.

అలాగే నానితో కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు యావరేజ్ అనే టాక్ దగ్గరే ఆగిపోయాయి. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై నిర్మించిన తేజ్ ఐ లవ్ యూ చేసి హిట్ అందుకుంది.  

ఆ తర్వాత ఆమె హలో గురు ప్రేమకోసమే సినిమాలో మరోసారి రామ్‌ తో కలిసి నటించింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో మళ్ళీ తెలుగులో కనిపించలేదు. మధ్యలో ఓ సినిమాకి దర్శకత్వ శాఖలోనూ పనిచేసింది.

అయితే అనుపమ మంచి టాలెంటెడ్. పర్ఫార్మెన్స్ పరంగా వేలు పెట్టాల్సిన పనిలేదు. కానీ ఆమె గ్లామర్ రోల్స్చే యకుండా అన్నీ కంప్లీట్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ రావడంతో గ్లామర్ రోల్స్ చేస్తూ స్టార్స్ గా వెలుగుతున్న రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, సమంత, కాజల్ అగర్వాల్ లాంటి వాళ్లని తట్టుకొని నిలబడలేకపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో నిఖిల్ హీరోగా నటిస్తున్న రెండు సినిమాలున్నాయి. అవి హిట్ అయితే మళ్ళీ ట్రాక్‌లోకి వస్తుందేమో చూడాలి.    

అనుపమ పరమేశ్వరన్‌లో ఉన్న మైనస్‌లు ఇవే..

అనుపమ పరమేశ్వరన్‌లో ఉన్న మైనస్‌లు ఇవే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here