Anupama Parameswaran: ప్రేమమ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైనటువంటి మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇలా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమెత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. భావోద్వేగాలను వ్యక్తపరిచే సమయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయనే ప్రశ్న తనకు ఎదురయింది. ఈ ప్రశ్నకు అనుపమ సమాధానం చెబుతూ.. భావోద్వేగాలను వ్యక్తపరిచే విషయంలో తాను చాలా నిజాయితీగా ఉంటానని తెలిపారు.
ఏ విషయంలో అయినా నాకు నచ్చకపోతే ఆ విషయాన్ని మొహం మీదే చెప్పేస్తాను. ఇక ఆ విషయాన్ని తన మైండ్లో ఉంచుకోనని అక్కడితో ఆ విషయాన్ని కూడా వదిలేస్తానని తెలిపారు.మనం గడుపుతున్న ఈ జీవితం చాలా చిన్నది కొద్దిరోజులు ఇక్కడకు వచ్చి మనకు నచ్చిన విధంగా ప్రవర్తించి తిరిగి వెళ్ళిపోతాము కాని ఆరోజు ఎప్పుడు వస్తుందనేది మాత్రం ఎవరికీ తెలియదని తెలిపారు.

Anupama Parameswaran: చెత్తను డిలీట్ చేస్తాను…
మనం బ్రతికున్న ఈ కొద్ది రోజులైనా ఆ ఒత్తిడిని దాచుకోవడానికి ఎందుకు అనవసరంగా శక్తిని వృధా చేయడం అంటూ తిరిగి ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజ్ లో నెల తర్వాత అందులో రికార్డు అయినటువంటి విషయాలన్నీ ఆటోమేటిక్గా డిలీట్ అవుతాయి. అలాగే నా మైండ్ లో కూడా చెత్తను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉంటానని ఈ సందర్భంగా అనుపమ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.































