Keerthy Suresh: కోలీవుడ్ స్టార్ జయం రవి, హీరోయిన్ కీర్తీ సురేష్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సైరెన్. ఈ సినిమాకు ఆంటోనీ భాగ్యరాజు దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రంలో జయం రవి ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్, థ్రిల్లర్, కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ మూవీని హోమ్ ఫిలిం మేకర్స్ పతాకంపై సుజాత నిర్మించారు. కాగా ఈ చిత్రంలో యోగిబాబు, సముద్రఖని ముఖ్యపాత్రలు నటించగా జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో జయం రవి జైలర్‌గా నటిస్తుండగా, నటి కీర్తి సురేష్ పోలీసు అధికారిగానూ, అనుపమ పరమేశ్వరన్ ఆయన ప్రేయసిగా నటించారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుండగా తాజాగా అభిమానులు ఊహించని వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ వార్త ఒకసారిగా షాక్ ఇచ్చింది. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి విడుదల చేయనున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది.
నేరుగా అందులో స్ట్రీమింగ్..
ఈ నెల 26న నేరుగా జీ5లో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు సమాచారం. గతంలో జయంరవి నటించిన భూమి చిత్రం కూడా నేరుగా ఓటీటీలో విడుదల కావడం విశేషం. దీంతో ఈ మూవీ విషయంలోనూ అదే జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే సైరెన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందన్న విషయాన్ని చిత్ర వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటనైతే రాలేదు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో అభిమానులు ఈ సినిమాలో థియేటర్లలో విడుదల చేయమంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.
































