Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.
ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.
































