AGENT Twitter Review : అఖిల్ అక్కినేని “ఏజెంట్” మూవీ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందో తెలుసా?

0
508

Akhil: అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ఏజెంట్. స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఈరోజు (ఏప్రిల్ 28వ తేదీ)న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక మాస్ ఇమేజ్ కోసం మొదటి సినిమా నుండి ట్రై చేస్తున్నాడు అఖిల్. ఈ నేపథ్యంలో మొదటి సినిమా “అఖిల్” డైరెక్టర్ వివి వినాయక్ తో గ్రాండ్ లాంచ్ చేసినా ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తరువాత “హలో”, మిస్టర్ మజ్ను సినిమాలు చేసినా అవి కూడా అంతంత మాత్రంగా ఆడాయి. ఈ రెండు సినిమాలు లవ్ బాయ్ ఇమేజ్ కొంచెం ఇచ్చినా.. అయన మాత్రం మాస్ ఇమేజ్ కోసమే ట్రై చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో తాజగా డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి స్పై త్రిల్లర్ ఏజెంట్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో మళయాళ నటుడు మమ్ముట్టి నటించడం మరో విశేషం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా కొత్త అమ్మాయి సాక్షి వైద్య పరిచయం అవుతుంది. “బాస్ పార్టీ” ఫెమ్ ఊర్వశి రహతుల తో ఒక ఐటెం సాంగ్ కూడా చేశారు. ఇప్పటికె విడుదలైన పాటలు, ట్రైలర్స్ ఈ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. అయితే భారీ అంచనాల నడుమ ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్సీస్ తో పలు చోట్ల ఫస్ట్ డే షోలు పడిపోయాయి. ఇక ఈ సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు ఈ సినిమాపై తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు, మరి ఎలా ఉందొ ఒకసారి చూసేద్దామా ?

ఈ సినిమా గురించి ట్విట్టర్ లో మిశ్రమ స్పందన వస్తుంది. అఖిల్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయని, కానీ అసలు సినిమాలో కథ సరిగా లేదని అంటున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు అసలు బాలేదని, ఎందుకు పెట్టార్రా బాబు అనిపిస్తున్నాయని అంటున్నారు. అసలు లవ్ ట్రాక్, హీరోయిన్ అస్సలు ఏమి ఉపయోగం లేదని అంటున్నారు. కొందరు ఫస్ట్ హాఫ్ ఓకే అని.. సెకండ్ హాఫ్ అస్సలు బాలేదని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అయితే అఖిల్ వన్ మెన్ షో చేసాడని సినిమా మొత్తం అఖిల్ తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడని అంటున్నారు.