Nagarjuna: నాగార్జునకు కోపం వస్తే అలాంటి పని చేస్తారా… నాగార్జున సీక్రెట్ బయటపెట్టిన అఖిల్!

0
106

Nagarjuna: టాలీవుడ్ నటు సామ్రాట్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మన్మధుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎంతో మంది మహిళ అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

మరోవైపు బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.ఇక నాగార్జునను మనం ఎలాంటి పరిస్థితులలో చూసిన ఆయన మొహంపై చిరునవ్వు ప్రశాంతత మాత్రమే కనబడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా తాను సీరియస్ గా అయినటువంటి సందర్భాలను కూడా మనం చూడలేదు.ఇలా ఎప్పుడు సరదాగా ఉండే నాగార్జునకు కోపం వస్తే ఊహించని విధంగా రియాక్ట్ అవుతారని తెలుస్తుంది.

ఎప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండే నాగార్జునకు కూడా కోపం వస్తుందా అన్న సందేహాలను నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయన కూడా మనిషే కదా తనకు కూడా కోపం వస్తుందని ఆ కోపం వస్తే నాగార్జున ఏం చేస్తారో అనే విషయాలను ఒకానొక సందర్భంలో అఖిల్ బయట పెట్టారు.ఈ సందర్భంగా అఖిల్ తన తండ్రి కోపం గురించి మాట్లాడుతూ నాన్నకు కోపం వస్తే ఆయన వెంటనే కిచెన్లోకి వెళ్లిపోతారని తెలిపారు.

Nagarjuna: నాన్నకు కోపం వస్తే వంట వండుతారు..

ఇలా కిచెన్ లోకి వెళ్లి వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తారని నాన్న చాలా అద్భుతంగా కుకింగ్ చేస్తారు అంటూ అఖిల్ తెలియజేశారు. ఇక తాను ఎప్పుడైనా షూటింగ్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి నాన్న కిచెన్ లో ఉన్నారు అంటే ఇంట్లో ఏదో జరిగిందని అందుకే నాన్న సీరియస్ గా ఉన్నారని తనకు అర్థమయ్యే కొంత సమయం పాటు నాన్నతో ఏమీ మాట్లాడమని ఈ సందర్భంగా తెలియజేశారు.