Jayaprada: క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన జయప్రద… వాళ్లే కమిట్మెంట్ ఇస్తున్నారంటూ?

0
115

Jayaprada: జయప్రద సీనియర్ నటి అనగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి వారితో కలిసి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇండస్ట్రీలో నటిగా ఓ వెలుగు వెలిగినటువంటి జయప్రద ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా జయప్రద ఇండస్ట్రీలో తరచూ హీరోయిన్స్ చేసే క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ మేము హీరోయిన్లుగా చేసే సమయంలో అసలు ఇలాంటి వినలేదని తెలిపారు. హీరోయిన్లుగా మా పని మేము చేసుకుని వెళ్లిపోయేవాళ్లు కానీ ప్రస్తుతం అవకాశాలు రావాలి అంటే ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిందేనని చెబుతున్నారు.

అవకాశాలు రావాలి అంటే క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కోవడం కాదు టాలెంట్ ఉండాలని జయప్రద తెలిపారు. టాలెంట్ ఉంటే అవకాశాలు అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయని ఈమె తెలిపారు.ఇకపోతే ప్రస్తుత కాలంలో ముంబైకి చెందినటువంటి ఎంతోమంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి వస్తున్నారు. వాళ్లు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కోసం భారీగానే ప్రయత్నాలు చేస్తున్నారు..

Jayaprada హీరోయిన్లే కమిట్మెంట్ ఇస్తున్నారు…


ఇలా అవకాశాల కోసం ముంబై కి చెందినటువంటి ఎంతోమంది అమ్మాయిలు దర్శక నిర్మాతలకే కమిట్మెంట్లు ఇస్తున్నారని వాళ్లే వారి పక్కన వెళ్లి పడుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇలా కమిట్మెంట్ గురించి క్యాస్టింగ్ కౌచ్ గురించి జయప్రద చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.