Pitapuram: దేశవ్యాప్తంగా ఏపీ ఎన్నికల ఫలితాలు అందరిలోనూ ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి ఎప్పుడు లేని విధంగా ఈసారి ఏకంగా 81.86% పోలింగ్ నమోదు కావడంతో ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే జూన్ నాల్గవ తేదీ వెలవడే ఫలితాల కోసం అందరూ ఆసక్తి చూపుతున్నారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలలో భాగంగా పిఠాపురం మంగళగిరి కుప్పం ఈ మూడు నియోజకవర్గాలపైనే అందరి ఫోకస్ ఉంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ఫలితాలపై రాజకీయ నాయకులు అటు సినీ సెలబ్రిటీలు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ దిగగా ఈయనకు ప్రత్యర్థిగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వంగ గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి వంగా గీత గెలిస్తే తనుకు డిప్యూటీ సీఎం గా పదవి ఇస్తానని చెప్పారు దీంతో ఈమె గెలుపు పై కూడా ఆసక్తి నెలకొంది.
ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠత..
ఈ క్రమంలోనే వంగా గీత గెలుస్తారని గెలుస్తారు అంటూ రెండు పార్టీల నేతలు పెద్ద ఎత్తున బెట్టింగులు కడుతున్నారు. అయితే కేవలం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పై మాత్రమే కాకుండా పార్లమెంట్ అభ్యర్థిపై కూడా సుమారు 500 కోట్ల వరకు బెట్టింగ్ జరిగిందని తెలుస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బెట్టింగులు కడుతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.





























