Sreeleela: నటి శ్రీ లీలపై సంచలన వ్యాఖ్యలు చేసిన బ్రహ్మాజీ…. ఆమె కూడా అదే స్థాయికి వెళ్తుంది అంటూ కామెంట్స్!

0
111

Sreeleela: శ్రీ లీల తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్టులో మొదటి స్థానంలో ఉన్నటువంటి శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీలీల గురించి నటుడు బ్రహ్మాజీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బ్రహ్మాజీ ప్రస్తుతం తన కుమారుడు సంజయ్ రావు నటిస్తున్నటువంటి స్లమ్ డాగ్ హస్బెండ్ అనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈనెల 29వ తేదీ విడుదల కాబోతుంది ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు అయితే ఒక ఇంటర్వ్యూలో హాజరైనటువంటి ఈయనకు యాంకర్ ప్రశ్నిస్తూ ఇప్పుడు కనుక మీకు హీరోగా అవకాశం వస్తే ఏ హీరోయిన్ పక్కన నటించాలని కోరుకుంటారు అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు బ్రహ్మాజీ సమాధానం చెబుతూ తాను నటి శ్రీ లీల పక్కన నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.ఈమె ఎంతో టాలెంట్ కలిగినటువంటి హీరోయిన్ డాన్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తుంది. అయితే నాకు డాన్స్ రాదు అనుకుంటే పొరపాటు నేను కూడా డాన్స్ చాలా బాగా చేస్తానని బ్రహ్మాజీ తెలిపారు.

Sreeleela: స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళుతుంది…


ఇక ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు ఈమెకు ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ అలాగే తన టాలెంట్ కనుక చూస్తే ఈమె కూడా స్టార్ హీరోయిన్స్ అయినటువంటి శ్రీదేవి జయసుధ జయప్రద వంటి వారి స్థాయికి చేరుకుంటుందని ఇండస్ట్రీలో అంతే స్థాయిలో ఆదరణ సంపాదించుకుంటుందని శ్రీ లీల గురించి బ్రహ్మాజీ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.