Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలలో ఎంతో బిజీగా మారిపోయారు. ఈయన వచ్చే ఎన్నికలలో ఏ విధంగా అయినా గెలవాలన్న ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి ఒంటరిగా పోరాటం చేయకుండా తెలుగుదేశం బిజెపితో కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు.

మే 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతాలలో మాత్రమే కాకుండా తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేసే స్థానాలలో కూడా పర్యటిస్తున్నారు. చంద్రబాబు నాయుడుతో కలిసి ఈయన రోడ్డు షోలలో పాల్గొంటున్నారు.
ఇక ఈనెల 18 నుంచి నామినేషన్స్ కూడా ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఈనెల 23వ తేదీ పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. 23వ తేదీ పవన్ కళ్యాణ్ స్వయంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేయబోతున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ నామినేషన్ కి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది.
ప్రారంభమైన నామినేషన్లు..
నామినేషన్ దాఖలు చేసిన రోజు సాయంత్రమే ఈయన ఉప్పాడలో భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. నామినేషన్ ప్రక్రియలు ప్రారంభం కావడంతో పలువురు నామినేషన్స్ వేశారు మొదటి రోజు అసెంబ్లీ సెగ్మెంట్లకు 197 నామినేషన్ల దాఖలు కాగా, పార్లమెంట్ సెగ్మెంట్లకు 42 నామినేషన్ల దాఖలయ్యాయి. అందులో వైసీపీ, ఎన్డీఏ కూటమి, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు.



























