AP Politics: ఎప్పుడు లేని విధంగా ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. మే 13వ తేదీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఎన్నికల ఫలితాలను జూన్ 4వ తేదీ విడుదల చేయనున్న నేపథ్యంలో అందరి ఆసక్తి ఏపీ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. పెరిగిన ఓటింగ్ శాతంతో కూటమి నేతలు తమదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ నేతలు సైతం జగన్ పరిపాలన నచ్చి ప్రజలందరూ మరోసారి ఆయనకు పట్టం కట్టడానికే ఓట్లు వేయడానికి ముందుకు వచ్చారని చెబుతున్నారు.

ఈ విధంగా రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో ఉత్కంఠత నెలకొన్నటువంటి సమయంలో రాష్ట్ర ప్రజలందరి చూపు కుప్పం నియోజకవర్గ పైనే ఉంది. కుప్పం నియోజకవర్గంలో నుంచి ఇప్పటివరకు ఏడుసార్లు పోటీ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఏడుసార్లు అఖండమైన మెజారిటీతో గెలిచి అసెంబ్లీకి వెళ్లారు. ఇక ఎనిమిదో సారి కూడా అదే మెజారిటీ సాధించాలనే దిశగా ఆయన ప్రయత్నాలు చేశారు.
ఇకపోతే అధికార వైసిపి పార్టీ కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓటమి లక్ష్యంగా పనిచేస్తుంది. గత చంద్రబాబు నాయుడు పాలనలో ఎప్పుడు కూడా కుప్పానికి చేయని అభివృద్ధి సంక్షేమం జగన్ సమక్షంలో జరిగింది. దీంతో ఈసారి కుప్పం ప్రజలందరూ కూడా వైసీపీకే పట్టం కట్టాలని భావిస్తున్నారు. ఈ తరుణంలోనే కుప్పం ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
బాబు ఓటమి లక్ష్యంగా..
కుప్పంలో వైసిపి తరఫున పోటీ చేసిన ఎమ్మెల్సీ భరత్ గెలుస్తారని అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు చంద్రబాబు గెలుస్తారని ప్రతిపక్ష పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే బెట్టింగులు కూడా భారీ స్థాయిలో నడుస్తున్నాయి. బాబు లక్ష మెజారిటీతో గెలుస్తారని బెట్టింగులు కట్టగా బాబు ఓటమి లక్ష్యంగా మరోవైపు బెట్టింగులు నడుస్తున్నాయి. ఇలా మొత్తానికి కోట్లలో బెట్టింగులు నడవడంతో అందరి ఆసక్తి కుప్పం పైన ఉందని చెప్పాలి.





























