Laya: సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో లయ ఒకరు. ఈమె హీరోయిన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు అయితే ఈమె నటించిన మొదటి సినిమాకే నంది అవార్డు రావడం విశేషం ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి లయ తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈమె పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈ విధంగా లయ పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు ఇక పెళ్లి తర్వాత ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుత తన కూతురితో కలసి సోషల్ మీడియాలో ఈమె చేసే హంగామా మామూలుగా లేదు అదే విధంగా తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ప్రస్తుతం నటుడు నితిన్ హీరోగా నటిస్తున్నటువంటి తమ్ముడు సినిమాలో లయ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటిస్తున్నటువంటి తరుణంలో లయ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రోడ్డుపై పడ్డాను..
తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నాను అయితే తాను అమెరికాలో ఉన్నాననే విషయం తెలియడంతో చాలామంది నాపై ట్రోల్స్ చేశారు. అమెరికాలో నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని అడుక్కు తింటూ రోడ్డుపై పడ్డానని చాలామంది విమర్శలు చేశారు . అయితే ప్రస్తుతం ఇలాంటి వాటి గురించి పట్టించుకోవడం లేదంటూ లయ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























