Kajal Agarwal: సినీ ఇండస్ట్రీలో కొనసాగాలంటే అందం ఎంతో ముఖ్యం ఇలా అందం కారణంగా సినిమా అవకాశాలు వస్తాయని ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగవచ్చని భావిస్తూ చాలా మంది అందానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ఇప్పటికే ముక్కు, పెదవులు వంటి భాగాలకు సర్జరీలు చేయించుకున్నారు.

ఈ క్రమంలోనే వెండితెర చందమామగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న నటి కాజల్ అగర్వాల్ సైతం సర్జరీ చేయించుకున్నారని తెలుస్తోంది. ఈమె ఇదివరకు ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి మెప్పించారు.ఇక కరోనా సమయంలో ఈమె పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఇక బాబు పుట్టిన తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు.
ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి కాజల్ అగర్వాల్ సత్యభామ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ సినిమా కావడంతో కాజల్ అగర్వాల్ సైతం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
పెదాలకు సర్జరీ..
ఇందులో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నటువంటి ఈమెను బాగా గమనిస్తే తను తన పెదాలకు సర్జరీ చేయించుకున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇదివరకే స్టార్ హీరోయిన్గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన కాజల్ ఇప్పుడు అడపాదడపా సినిమాలలో అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తున్న సమయంలో సర్జరీ చేయించుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. పెళ్లయిన తరువాత ఇలా సర్జరీ చేయించుకోవడం అవసరమా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.



























