Modi: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తిగా త్వరలోనే ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఏపీలో జరిగినటువంటి ఎన్నికలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఎన్నికల బరిలో దిగగా మరోవైపు తెలుగుదేశం బిజెపి జనసేన మూడు పొత్తుగా ఏర్పడి ఎన్నికల బరిలోకి వచ్చాయి.

ఈ విధంగా పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీ హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. అయితే ఇప్పటికే ఈ పథకం పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలోనూ అలాగే కర్ణాటకలో కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం గురించి స్వయంగా నరేంద్ర మోడీ చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం సరైనది కాదని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం హామీతో మెట్రోలను ఇబ్బందులలో పడేస్తున్నాయని ఈయన తెలిపారు. మహిళలకు ఉచితం బస్సు ప్రయాణం కావడంతో మెట్రోపై ఆదాయం తగ్గుతుందని వెల్లడించారు.
మెట్రో ఆదాయంపై దెబ్బ..
ఇలా చేయటం వల్ల మెట్రో నిర్వహణ సాధ్యం కాదని తెలిపారు. భవిష్యత్తులో మెట్రో నిర్మాణం సాధ్యమవుతుందా లేదా అన్న విషయంపై సందిగ్ధత కూడా ఏర్పడుతుందని మోడీ వెల్లడించారు. ఈ విధంగా బస్సును ఫ్రీగా ఇచ్చి మెట్రోని ఖాళీ చేస్తే ఎలా నడుస్తుందని ఈయన ప్రశ్నించారు. ఇక విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు బిజెపితో పొత్తులో భాగంగా ప్రకటించినటువంటి హామీలలో ఉచిత బస్సు ప్రయాణం ఉండటం గమనార్హం.





























