Regina: అవకాశం కోసం అడిగితే కమిట్మెంట్ అడిగారు… కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన రెజీనా!

0
29

Regina: సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనే సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈవిషయం గురించి మాట్లాడుతూ మేము కూడా కెరియర్ మొదట్లో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నామని తెలియజేశారు. అయితే తాజాగా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రెజీనా సైతం కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రెజినా ఇండస్ట్రీలో తనకు ఎదురైనటువంటి ఈ చేదు అనుభవం గురించి తెలియజేశారు. తాను 20 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని తెలిపారు. అయితే కెరీర్ మొదట్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తాను కొంతమందిని కలిసే సినిమా అవకాశాల కోసం వారిని అడిగానని తెలిపారు.

దీంతో ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి తనకు సినిమా అవకాశం ఇస్తాను కానీ అడ్జస్ట్మెంట్ అవ్వాలని ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పడంతో నాకు అడ్జస్ట్మెంట్ అంటే అప్పుడు తెలియక రెమ్యూనరేషన్ పరంగా అడుగుతున్నారేమోనని నా మేనేజర్ మాట్లాడుతారు అంటూ ఫోన్ కట్ చేశాను. అనంతరం తన మేనేజర్ వచ్చి అడ్జస్ట్మెంట్ అంటే ఆయన మీ నుంచి ఇలాంటి కోరిక కోరుతున్నారని తనకు చెప్పారు..

Regina: నా మేనేజర్ చెప్పే వరకు తెలియదు…


ఈ విధంగా నా మేనేజర్ చెప్పేవరకు ఆయన అలాంటి ఉద్దేశంతో మాట్లాడారని తనకు తెలియలేదు.అలా తాను కూడా మొదటిసారి ఇలాంటి ఇబ్బందిని పేస్ చేశానని అనంతరం తనకు ఎప్పుడు ఇలాంటి సంఘటనలు ఎదురు కాలేదు అంటూ ఈ సందర్భంగా కాస్టింగ్ కౌచ్ గురించి రెజీనా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ మధ్యకాలంలో ఈమెకు పెద్దగా సినిమాలు సక్సెస్ కాకపోవడంతో పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.