దేశంలోని చాలామందికి సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఉంటుంది. అద్దె ఇంట్లో ఉంటే సంవత్సరాలకు సంవత్సరాలు గడిచినా వేతనంలో ఎక్కువ మొత్తం ఇంటి అద్దె కోసమే చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల చాలామంది హోం లోన్ తీసుకుని సొంత ఇంటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అలా సొంత ఇంటిని కొనుగోలు చేయాలని అనుకునే వారికి బ్యాంకులు ఎక్కువ మొత్తం వడ్డీకి లోన్లను ఇస్తుంటాయి.అయితే ఒక బ్యాంకు మాత్రం సున్నా వడ్డీకే హోం లోన్లను కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. ఏకంగా 20 సంవత్సరాల కాలపరిమితితో ఆ బ్యాంకు హోం లోన్ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే ఆ బ్యాంకు మన దేశానికి చెందినది కాకపోవడం గమనార్హం. డెన్మార్క్ కు చెందిన డాన్ స్కీ బ్యాంక్ హోమ్ లోన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. 20 సంవత్సరాల పాటు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

సాధారణంగా మన దేశంలో బ్యాంకులో నగదును డిపాజిట్ చేస్తే బ్యాంకులు కొంత మొత్తం వడ్డీ ఇస్తాయి. అయితే డెన్మార్క్ లోని బ్యాంకు మాత్రం బ్యాంకులో డిపాజిట్ చేస్తే కస్టమర్ల నుంచే రివర్స్ లో వడ్డీ వసూలు చేస్తోంది. డెన్మార్క్ కేంద్ర ప్రభుత్వం బ్యాంకులో వడ్డీ రేట్లను – 0.6 గా నిర్ణయించడంతో బ్యాంకులో డబ్బులను దాచుకునే వాళ్లే రివర్స్ లో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

డాన్‌స్కీ బ్యాంక్ తో పాటు ఇతర బ్యాంకులు సైతం కస్టమర్లకు ఇదే తరహాలో లోన్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. గత ఎనిమిది సంవత్సరాల నుంచి డాన్‌స్కీ బ్యాంక్ లో వడ్డీ రేట్లు 0 కంటే తక్కువగానే ఉండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here