Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సమంత ఒకరు. సమంత మయోసైటీస్ వ్యాధి కారణంగా కొన్ని రోజులపాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైన సంగతి మనకు తెలిసిందే. ఇలా సమంత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే గతంలో యశోద సినిమా సమయంలో ఈమె సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. కానీ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన బాధ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సమంత ఇంటర్వ్యూ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకొని ఏడవటంతో చాలామంది ఈమె పట్ల నెగిటివ్ కామెంట్లు చేశారు. సింపతి క్వీన్ అంటూ ట్రోల్ చేశారు.
తాజాగా ఈ ట్రోల్స్ పై సమంత స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చాలామంది నేను కన్నీళ్లు పెట్టుకొని నా బాధను బయటకు చెప్పగా నన్ను ట్రోల్ చేశారు. ఆ సమయంలో నేను పడిన బాధ కష్టం నాకు మాత్రమే తెలుసు. ఇక నేను మయోసైటిసిస్ వ్యాధి బారిన పడ్డాను అనే విషయం చెప్పకపోయి ఉంటే మరింత ఘోరంగా ట్రోల్ చేసేవారు.
ఆ బాధ నాకే తెలుసు…
నా బాధ గురించి ఆలోచించకుండా నన్ను ట్రోల్ చేసిన వారి గురించి కూడా నేను పెద్దగా పట్టించుకోనని ఈ సందర్భంగా తన పట్ల విమర్శలు చేస్తున్న వారికి కూడా సమంత ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఇక సమంత ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారనే తెలుస్తోంది. త్వరలోనే ఈమె ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి పూర్తిగా సిద్ధమయ్యారని తెలుస్తుంది.































