భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు శుభవార్త. సీతారామ పంప్ హౌస్ 2 ట్రయల్ రన్ సక్సెస్ అయింది. భద్రాద్రి కొత్తగూడెం, ములకలపల్లి మండలం పూసుగుడంలోని వి.కే రామవరం వద్ద సీతారాం ప్రాజెక్టు పంప్ హౌస్ పేస్ 2 ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. ఈ మేరకు గోదావరి జలాలు దిగువకు విడుదల చేశారు అధికారులు.

సాగర్ ఎడమ కాల ద్వారా ఖమ్మం జిల్లాలో సాగవుతున్న కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు తరలించాలనేది సీతారామ ప్రాజెక్టు లక్ష్యం. ప్రస్తుతం ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ నింపి సత్తుపల్లి , వైరా ప్రాంతానికి నీళ్లు ఇవ్వబోతున్నారు రేవంత్ సర్కార్. ఇందులో ఆరు బాహుబలి మోటర్లు ఉండగా ఒక మోటర్ తో 1500ల క్యూసెక్కుల నీటిని ట్రయల్ ద్వారా దిగువకు విడుదల చేశారు అధికారులు. ట్రయల్ రన్ కోసం గత 10 రోజులుగా జపాన్ మరియు చైనా టెక్నీషియన్ల బృందం విశ్రాంతి లేకుండా శ్రమించారు.. ట్రయల్ రన్ విజయవంతం కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. మూడో పంప్ కూడా త్వరలో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు శుభవార్త. సీతారామ పంప్ హౌస్ 2 ట్రయల్ రన్ సక్సెస్ అయింది. భద్రాద్రి కొత్తగూడెం, ములకలపల్లి మండలం పూసుగుడంలోని వి.కే రామవరం వద్ద సీతారాం ప్రాజెక్టు పంప్ హౌస్ పేస్ 2 ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. ఈ మేరకు గోదావరి జలాలు దిగువకు విడుదల చేశారు. pic.twitter.com/bXAtOU0KwJ
— TeluguDesk (@telugudesk) August 2, 2024



























