YS Sharmila: పోలవరానికి బాబు చేసింది శూన్యం.. చంద్రబాబుపై షర్మిల షాకింగ్ కామెంట్స్!

YS Sharmila: వైయస్ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడమే కాకుండా అధికార పక్షంపై విమర్శలు చేస్తూ వార్తలలో నిలిచారు. గత ఎన్నికలకు ముందు ఈమె కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోవడమే కాకుండా ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో తన అన్నయ్య పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మి ఆయనకు అత్యధిక మెజారిటీ ఇచ్చారు. కానీ ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అంటూ మండిపడ్డారు. ఇలా ఆంధ్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారని రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేదని నిరుద్యోగుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గాలికి వదిలేసారు అంటూ మండిపడ్డారు.

ఇకపోతే తాజా ఎన్నికలలో కూటమి అధికారంలోకి రావడం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నియమితులవడం జరిగింది. ఈ క్రమంలోనే మరోసారి ముఖ్యమంత్రిపై ఈమె చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి. పోలవరం పూర్తి కాకపోవడానికి కేంద్ర ప్రభుత్వమని, లేదు గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన తప్పిదమే పోలవరం పెండింగ్ కు కారణం అని వైసిపి నేతలు, వైసిపి ప్రభుత్వం నిధులు తీసుకొని నిర్మాణం పూర్తి చేయలేకపోయిందని టీడీపీ ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు.

ఇలాంటి తరుణంలోనే షర్మిల స్పందిస్తూ..ఈ ప్రాజెక్టు కట్టి 28 లక్షల ఎకరాలకు సాగునీటి ఇవ్వడం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆశయమే అంటూ.. పంతాలకు పట్టింపులకు పోయి జీవనాడి పైన ఇన్నాళ్లు రాజకీయ కుట్ర చేశారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే తర్వాత వచ్చిన మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు నిధులు ఇవ్వకుండా ఆపివేసిందని తెలిపారు.

సోమవారం పోలవరం..
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత సోమవారం పోలవరం అంటూ హడావిడి చేస్తున్నారు కానీ గతంలో ఆయన ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో చేసింది మాత్రం శూన్యం అంటూ షర్మిల చంద్రబాబు గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.