జ్వరంతో బాధ పడేవారికి షాకింగ్ న్యూస్.. ఆ రెండు పరీక్షలు తప్పనిసరి..!

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంటే మరోవైపు సీజనల్ వ్యాధులకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసుల సంఖ్య తగ్గినా పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులోకి రావాల్సి ఉంది. ఎవరైనా కరోనాతో పాటు డెంగీ బారిన పడితే చికిత్స అందించడంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. దీంతో కేంద్రం తాజాగా మరోసారి మార్గదర్శకాలను విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి వెలువడిన నూతన మార్గదర్శకాల వల్ల ఇకపై జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరూ కరోనా, డెంగీ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. కరోనా, డెంగీ బారిన పడినప్పటికీ చాలామందిలో ఆయా వ్యాధులకు సంబంధించిన లక్షణాలు కనిపించడం లేదు. దీంతో అధికారులు పరీక్షల ద్వారా మాత్రమే వ్యాధుల నిర్ధారణ సాధ్యమవుతుందని.. లేకపోతే ఆ వ్యాధుల వల్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని చెబుతున్నారు.

కరోనా, డెంగీ వ్యాధులకు చికిత్స లేకపోవడంతో లక్షణాల ఆధారంగా రోగులకు చికిత్స చేస్తున్నారు. జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరికీ కరోనా, డెంగీ పరీక్షలు నిర్వహించాలని క్ 80 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదని తెలిసిందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా, డెంగీ రోగులకు వేర్వేరు చికిత్సా విధానాలు అమలులో ఉన్నాయని ఏ మాత్రం నిర్లక్ష్య్ం వహించినా రోగి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలు ప్రస్తుత పరిస్థితుల్లో రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని.. ఇంటి పరిసరాలు శుభ్రం చేసుకుంటూ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఆక్సిజన్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.