srihan1

Shrihan: రన్నర్ గా నిలిచిన శ్రీహన్ బిగ్ బాస్ ద్వారా ఎంత సంపాదించారో తెలుసా?

Shrihan: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం డిసెంబర్ 18న ఎంతో ఘనంగా గ్రాండ్ ఫినాలేను జరుపుకుంది. ఈ సీజన్ లో భాగంగా రేవంత్ విన్నర్ కాగా… శ్రీహాన్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం బిగ్ బాస్ రన్నర్ గా నిలిచిన శ్రీహన్ బిగ్ బాస్ ద్వారా ఎంత మొత్తంలో సంపాదించారని పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.

srihan1

మరి బిగ్ బాస్ ద్వారా శ్రీహాన్ ఎంత మొత్తంలో గెలుచుకున్నారు అనే విషయానికి వస్తే….శ్రీహన్ 15 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగారు కనుక ఈయనకు 15 వారాలకు గాను వారానికి లక్ష రూపాయలు చొప్పున 15 లక్షల రెమ్యూనరేషన్ అందించినట్లు తెలుస్తోంది.ఇక ఈయన లెన్స్ కార్ట్ స్టైలిష్ మాన్ అఫ్ ది సీజన్ కూడా గెలవడంతో మరొక ఐదు లక్షలు బోనస్ గా వచ్చాయి.

ఇక టాప్ టు కంటెస్టెంట్లకు బిగ్ బాస్ 40 లక్షలు ఆఫర్ చేయగా శ్రీహన్ 40 లక్షల బ్రీఫ్ కేస్ తీసుకొని బయటకు వచ్చారు. ఇలా శ్రీహన్ 60 లక్షలు రూపాయలు అందుకున్నారు. అదేవిధంగా శ్రీహాన్ సువర్ణ భూమి ల్యాండ్ ఎప్పుడు కొన్న ఆయనకు 50 పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందని సువర్ణభూమి డెవలపర్స్ బిగ్ బాస్ వేదికపై శ్రీ హన్ కి హామీ ఇచ్చారు.

rihan

Shrihan: ఓట్ల పరంగా మొదటి స్థానంలో ఉన్న శ్రీహాన్….


ఈ విధంగా శ్రీహాన్ సుమారు 70 లక్షలకు పైగా బిగ్ బాస్ ద్వారా సంపాదించి ఉంటారని భావిస్తున్నారు. మొత్తానికి శ్రీ హాన్ రన్నర్ అయినప్పటికీ, భారీగానే సంపాదించారని తెలుస్తోంది. ఇక శ్రీహన్ 40 లక్షల బ్రీఫ్ కేసు అందుకోవడంతో విజేతగా రేవంత్ ట్రోఫీ అందుకున్నారు అయితే రేవంత్ కన్నా అధిక ఓట్ల మెజార్టీతో శ్రీహాన్ మొదటి స్థానంలో ఉన్నారని నాగార్జున చెప్పడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో నిజమైన విజేత శ్రీహాన్ అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.