Srija Konidela: ఏడుస్తుంటే ఓదార్చారు.. నేను మాట్లాడితే విన్నారు.. ఎమోషనల్ అయినా శ్రీజ!

Srija Konidela: శ్రీజ కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తెగా ఈమె అందరికీ ఎంత సుపరిచితమే. ఈమె కాలేజీ చదువుతున్న రోజులలోనే శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాకుండా తన కుటుంబం నుంచి ప్రాణహాని ఉందంటూ ఏకంగా తన కుటుంబం పై పోలీస్ కేసు కూడా పెట్టారు. ఇలా ఒక్కసారిగా వార్తలలో నిలిచిన శ్రీజ అనంతరం తన భర్తకు విడాకులు ఇచ్చారు.

ఇలా శిరీష్ భరద్వాజ్ తో విడిపోయిన శ్రీజ తిరిగి తన తండ్రి సూచించిన కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో సంతోషంగా గడిపారు.ఇలా మొదటి భర్తకు ఒక కుమార్తె రెండవ భర్తకు మరొక కుమార్తెకు జన్మనిచ్చిన శ్రీజ తన బిడ్డలతో కలిసి ఎంతో సంతోషంగా ఉన్నారు.అయితే గత కొంతకాలం నుంచి శ్రీజ కళ్యాణ్ దేవ్ విడిపోయారని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో మరోసారి శ్రీజ వార్తల్లో నిలిచారు.

ఇక వీరిద్దరికీ విడాకులు జరిగినప్పటికీ ఈ విషయాన్ని మెగా కుటుంబం అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తోంది. ఇక కళ్యాణ్ దేవ్ దూరం కావడంతో శ్రీజ ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తనకి తన కుటుంబం, స్నేహితులు ఎంతో అండగా నిలిచారు.ఇక రాంచరణ్ తననీ వెకేషన్ లకు తీసుకెళ్తూ వారిని ఎంతో సంతోషంగా ఉంచడం కోసం ప్రయత్నిస్తున్నారు.

Srija Konidela: కష్ట సమయంలో అండగా నిలిచారు…

ఈ క్రమంలోనే శ్రీజ ఈ విషయం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. కష్ట సమయంలో నాకు ప్రతి ఒక్కరు ఎంతో అండగా నిలిచారు. నేను ఏడిస్తే ఓదార్చారు. నేను నవ్వితే సంతోషించారు.. నేను మాట్లాడేటప్పుడు మీరు విన్నారు.. ఇలా కష్ట సమయాల్లో తనకు అండగా నిలిచి తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిన కుటుంబ సభ్యులు స్నేహితులకు కృతజ్ఞతలు అంటూ ఈ సందర్భంగా ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.