Super Star Krishna : డబుల్ హ్యాట్రిక్ త్రిపాత్రాభినయ చిత్రాలతో.. హీరో కృష్ణ రికార్డుల మోత మోగించారు.?!

Super Star Krishna : “కుమారరాజా” పి. సంబశివరావు దర్శకత్వంలో 1978 లో వచ్చిన సినిమా. ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద, సత్యనారాయణ, జయంతి, లత ముఖ్య పాత్రల్లో నటించారు. ఇందులో కృష్ణ మూడు – అన్యాయమైన వ్యాపారవేత్త రాజశేఖర్, అతని నుండి విడిపోయిన కవల కుమారులు కుమార్, రాజా – పాత్రలను పోషించాడు. ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతం ఇచ్చాడు.ఈ చిత్రం రాజ్‌కుమార్ నటించిన 1978 కన్నడ చిత్రం శంకర్ గురుకు రీమేక్.

Super Star Krishna : డబుల్ హ్యాట్రిక్ త్రిపాత్రాభినయ చిత్రాలతో.. హీరో కృష్ణ రికార్డుల మోత మోగించారు.?!

“పగబట్టిన సింహం” కృష్ణ మూడు పాత్రలలో  నటించిన యాక్షన్ డ్రామా చిత్రం, ఇందులో జయప్రద, ప్రభ, గీత, కైకాల సత్యనారాయణ, ప్రసాద్ బాబు నటించారు. చంద్ర సినీ ఆర్ట్స్ పతాకంపై,పి చంద్రశేఖర రెడ్డి దర్శకత్వంలో కలిదిండి విశ్వనాథ రాజు నిర్మించాడు. చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు. ఈ చిత్రం 1982 సెప్టెంబరు 3 న విడుదలై, మంచి సమీక్షలు అందుకుంది.

“సిరిపురం మొనగాడు’ 1 జూన్ 1983న విడుదలైన భారతీయ తెలుగు-భాషా యాక్షన్ చిత్రం. కృష్ణ త్రిపాత్రాభినులైన శ్రీధర్, ఆనంద్ మరియు లయన్‌లతో పాటు జయప్రద, KR విజయ, కైకాల సత్యనారాయణ, నూతన్ ప్రసాద్ మరియు కాంతారావు నటించారుప్రధాన పాత్రలు. శ్రీకాంత్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ నహతా ఈ చిత్రాన్ని నిర్మించగా కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించారు.

“బంగారుకాపురం” ఆగస్టు 9, 1984న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ పంచవతి చిత్రాలయ బ్యానర్ పై కోగంటి విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, జయసుధ, జయప్రద ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.

కృష్ణ నట జీవితంలో ఒక మణిపూస లాంటి సినిమా ‘రక్త సంబంధం’. నటుడిగా ఆయనను ప్రపంచానికి చాటిన సినిమాల్లో ఇదొకటి. ఇందులో కృష్ణ తండ్రీ కొడుకులుగా త్రిపాత్రాభినయం చేశారు. తండ్రి చక్రవర్తిగా, కొడుకులు కృష్ణ, విజయ్‌గా మూడు భిన్న పాత్రలను ఉన్నత స్థాయిలో పోషించారు. గంభీరంగా కనిపించే చక్రవర్తి పాత్రలో గొప్పగా అనిపిస్తారు. ఆవేదన జ్వాల దహించే కృష్ణగా అపూర్వ నటన ప్రదర్శించారు. చిలిపితనం, అమాయకత్వం కలగలసిన విజయ్‌గా ముచ్చట గొలిపారు.
చక్రవర్తి భార్య పాత్రలో జయంతి, విజయ్ ప్రియురాలిగా రాధ కనిపిస్తారు. డాక్టర్ రాజారావు పాత్రలో సత్యనారాయణ గురించి చెప్పాల్సిన పనిలేదు. విజయనిర్మల దర్శకత్వ ప్రతిభకు ఈ సినిమా ఒక నిదర్శనం.ఆమె కల్పించిన ప్రతి సన్నివేశమూ ఆకట్టుకుంటుంది.చక్రవర్తి సంగీతం వీనుల విందుగా నిలిచింది.

కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన చివరి చిత్రంగా “బొబ్బిలిదొర” గా చెప్పవచ్చు. 1997 శ్రీ ప్రొడక్షన్స్, కంటిపూడి. పద్మావతి, భవాని నిర్మాణం, బోయపాటి కామేశ్వరరావు దర్శకత్వంలో కృష్ణ, సంఘవి, సంగీత హీరో, హీరోయిన్లుగా, విజయనిర్మల ప్రధానపాత్రలో కనిపించారు.ఇక ప్రత్యేక పాత్రలో కైకాల సత్యనారాయణ కనిపిస్తారు. సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాలో హరిశ్చంద్ర ప్రసాద్, శరత్ చంద్ర ప్రసాద్,కృష్ణ ప్రసాద్ అను మూడు పాత్రల్లో కృష్ణ త్రిపాత్రాభినయం చేశారు. ఇలా ఆరు చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసి డబుల్ హ్యాట్రిక్ కొట్టిన హీరోగా తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ రికార్డు సృష్టించారు.