Super Star Krishna : ఆ రోజుల్లో స్టార్ డమ్ రావడానికి శోభన్ బాబుకి 10 సంవత్సరాలు పట్టింది కానీ నాకు మాత్రం మూడో చిత్రంతో వచ్చేసింది. : హీరో కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన కథానాయకుడు. 1964 కంటే ముందు కృష్ణ కొన్ని చిత్రాల్లో చిన్న వేషాలు వేసినప్పటికీ ఆ తర్వాత హీరోగా నటించడం మొదలుపెట్టారు. నాలుగు దశాబ్దాల పాటు నిర్విరామంగా కొనసాగిన అతని సినీ జైత్రయాత్ర లో.. ఆయనా ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తూ.. యువ హీరోలకు సైతం పోటీనిచ్చిన హీరోగా చెప్పుకోవచ్చు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా అనేక చిత్రాల్లో నటిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగడించారు. 1964 దర్శకుడు ఆదుర్తిసుబ్బారావు తను తీస్తున్న సినిమాకి నూతన నటీనటులు కావాలని పేపర్ యాడ్ ఇచ్చారు. అది చదివిన హీరో కృష్ణ తన ఫోటోలను మద్రాస్ పంపించారు. అనేక వడపోతల తర్వాత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కృష్ణని ఈ సినిమాలో ఇద్దరు హీరోల్లో ఒకరిగా ఎంపికచేయడం జరిగింది. అలా ఆ సినిమాలో హీరోగా మొదలైన హీరో కృష్ణ సినీ ప్రయాణంలో అంచెలంచెలుగా ఎదిగారు.

Super Star Krishna : ఆ రోజుల్లో స్టార్ డమ్ రావడానికి శోభన్ బాబుకి 10 సంవత్సరాలు పట్టింది కానీ నాకు మాత్రం మూడో చిత్రంతో వచ్చేసింది. : హీరో కృష్ణ

ఇక అందాల నటుడు శోభన్ బాబు విషయానికి వస్తే..
మద్రాసులో లా కోర్సులో చేరినప్పటికీ నటన పైన ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఉదయం కాలేజీకి వెళ్ళి, మధ్యాహ్నం నుండి స్టూడియోల వెంట తిరిగేవాడు. అప్పుడే తన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నాడు. పొన్నులూరి బ్రదర్స్ వారు దైవబలం చిత్రంలో రామారావు సరసన ఒక పాత్ర ఇచ్చారు. కానీ ఆ సినిమా విజయవంతం కాలేదు. ఆ సమయంలోనే నారాయణరావు నిర్మించిన భక్త శబరి చిత్రంలో ఒక మునికుమారునిగా నటించాడు. 1960 జూలై 15న విడుదలయిన ఆ సినిమా కాస్త విజయవంతమవ్వడంతో శోభన్ బాబు పేరు సినీరంగంలో పరిచయమయ్యింది. ఆ తర్వాత ఆయన అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాలను పొందారు.

అయితే ఒక ఇంటర్వ్యూలో కృష్ణ మాట్లాడుతూ.. 1960 ఆ ప్రాంతంలో తాను, సహనటుడు శోభన్ బాబు కలిసి పాండిబజార్ లోని వాణిమహల్ లో “చేసిన పాపం కాశికి పోయిన” అనే నాటకం వేసామని దానికి మా ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. మొదటగా తేనె మనసులు, కన్నె మనసులు ఆ తర్వాత గూడచారి 116 చిత్రాలలో నటించానని.. మూడవ చిత్రంతోనే నాకు స్టార్డమ్ వచ్చింది. కానీ నా సహనటుడు శోభన్ బాబుకు.. మాత్రం 50 చిత్రాలలో నటించిన తర్వాత అంటే దాదాపు పది సంవత్సరాల తర్వాత ఆయనకు “మనుషులు మారాలి” సినిమాతో స్టార్ డమ్ వచ్చిందని హీరో కృష్ణ చెప్పారు. ఇంకో విషయం ఏమిటంటే మనుషులు మారాలి చిత్రం తానే చేయాల్సి ఉండేది. కానీ అప్పటికే అనేక చిత్రాల్లో నటిస్తూ ఉండడం వలన డేట్స్ అడ్జస్ట్ కాక ఆ సినిమా వదులుకున్నాను. అదే సినిమాతో శోభన్ బాబు సూపర్ హిట్ అందుకున్నాడని. ఆ చిత్రంతోనే ఆయనకు స్టార్ డమ్ కూడా వచ్చిందని ఆ ఇంటర్వ్యూలో హీరో కృష్ణ చెప్పుకొచ్చారు.