Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను కలిసిన తన ఫస్ట్ సినిమా హీరోయిన్.. ఫోటో వైరల్!

Pawan Kalyan: సినీ నటుడిగా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు రాజకీయాలలోకి అడుగుపెట్టారు. ప్రస్తుత రాజకీయ నాయకుడిగా ఏపీ రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఎంతో కీలకంగా మారారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రిగా పలు శాఖల బాధ్యతలను తీసుకొని ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలవడం కోసం టాలీవుడ్ సినిమా సెలబ్రిటీలు అందరూ కూడా ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకొని అనంతరం విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ ని కలిశారు.

ఇలా పలువురు టాలీవుడ్ ప్రొడ్యూసర్ తో పాటు లేడీ ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డ కూడా పవన్ కళ్యాణ్ ను కలిసారు. ఇలా వీరంతా పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అనంతరం చిత్ర పరిశ్రమపై ఉన్నటువంటి ఇబ్బందుల గురించి సమస్యల గురించి పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినవారు కావడంతో సమస్యల గురించి ఆయనకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి
ఇక ప్రస్తుత ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలిసి అనంతరం వారి సమస్యలను తెలియజేశారు.ఈ క్రమంలోనే సుప్రియ పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇది కాస్త వైరల్ గా మారింది. వీరిద్దరూ కలిసి మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో నటించారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత సుప్రియ పెద్దగా సినిమాలలో నటించలేదు. ప్రస్తుతం ఈమె నిర్మాతగా మారగా పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా మారడంతో ఈ ఫోటో కాస్త వైరల్ అవుతుంది.