ట్యాబ్లేట్స్ ఇలా వేసుకుంటే అవి పని చెయ్యడం కష్టం..?

సాధారణంగా మనకు ఏ చిన్న జబ్బు ఉ చేసిన వెంటనే ఆ జబ్బు నుంచి ఉపశమనం పొందడానికి టాబ్లెట్లు ఉపయోగిస్తున్నాము. అయితే ఈ టాబ్లెట్లు మనపై పని ప్రారంభించడానికి సుమారు 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది.కొందరిలో వారి శరీర బరువు వ్యక్తిత్వాన్ని బట్టి మాత్రల పనిచేయడం ప్రారంభమవుతుంది. అయితే ప్రతి ఒక్కరూ మాత్రలు మింగేటప్పుడు చల్ల నీటితోనే టాబ్లెట్ వేసుకోవడం మనం చూస్తుంటాము. మరికొందరు మాత్రం గోరువెచ్చని నీటిలో టాబ్లెట్ వేసుకోవడం వల్ల త్వరగా సత్ఫలితాలు వస్తాయని భావిస్తారు. అయితే ఈ నీటిలో టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏ విధంగా పని చేస్తాయో తెలుసుకుందాం…

సాధారణంగా మనం టాబ్లెట్ వేసుకునే సమయంలో చల్లని నీటితో టాబ్లెట్ వేసుకోవడం వల్ల అవి మన జీర్ణాశయంలో కరిగి రక్తంలో కలవడానికి కొంత ఎక్కువ సమయం తీసుకుంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే టాబ్లెట్స్ వేసుకునేటప్పుడు గోరువెచ్చని నీటిలో వేసుకోవడం ద్వారా టాబ్లెట్స్ తొందరగా కరిగి మన రక్తంలోకి చేరి వాటి ప్రభావం మనపై పెడుతుందని నిపుణులు తెలిపారు.

మరికొందరు టాబ్లెట్స్ వేసుకునే సమయంలో పాలు కాఫీ లేదా వివిధ రకాల జ్యూస్లను కలిపి వేసుకుంటారు. అయితే ఈ విధమైనటువంటి వాటిలో టాబ్లెట్ వేసుకోవడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.ఇలా టాబ్లెట్ వేసుకోవడం వల్ల అవి పని చేయడం చాలా కష్టం అని నిపుణులు పలు అధ్యయనాల ద్వారా వెల్లడించారు.

మనం జబ్బుల నుంచి ఉపశమనం పొందడం కోసం వేసుకునే ట్యాబ్లెట్లు తొందరగా మనపై ప్రభావం చూపాలంటే తప్పకుండా గోరు వెచ్చని నీటిలో టాబ్లెట్ వేసుకోవడం వల్ల తొందరగా మన రక్తంలో కలిసి మనకు వ్యాధి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మరికొందరు ఎటువంటి ద్రవ పదార్థాలు తీసుకోకుండా కేవలం ఒట్టి మాత్రలనే మింగుతూ ఉంటారు.ఈ విధంగా మింగటం వల్ల వారిలో చాతిలో మంట, గుండెల్లో దడ, రక్త ప్రసరణ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.