Tag Archives: 10000 jobs

నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త.. 10,000 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతున్నారు. నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా జగన్ సర్కార్ రాబోయే 24 నెలల్లో ఏకంగా 10,000 మంది నర్సులను నియమించుకునేందుకు సిద్ధమైంది. నర్సుల నియామకం ద్వారా జగన్ సర్కార్ గ్రామీణ ప్రాంతాల్లో సైతం వైద్య సేవలు అందేలా చేయాలని భావిస్తోంది.

రాష్ట్రంలో జగన్ సర్కార్ ఇప్పటికే వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ ను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ హెల్త్ క్లినిక్స్ ద్వారా మారుమూల పల్లెల్లో సైతం మెరుగైన వైద్య సేవలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. జగన్ సర్కార్ రాష్ట్రంలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ల కోసం భవనాల నిర్మాణాలను చేపడుతోంది. ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఏపీలో ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందేలా జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది.

బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులను ఈ ఉద్యోగాల కోసం ప్రభుత్వం నియమించుకోనుంది. ప్రస్తుతం జగన్ సర్కార్ 4,060 ఉద్యోగాలకు అనుమతులు ఇవ్వగా మిగిలిన ఉద్యోగాలకు త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్శిటీ నిపుణులు శిక్షణ ఇస్తారు.

జగన్ సర్కార్ నర్సులకు శిక్షణ సమయంలో అకామిడేషన్, భోజన వసతి కల్పించడంతో పాటు స్టైఫండ్ ఇవ్వనుంది. ప్రభుత్వం హెల్త్ క్లినిక్ ల ద్వారా ప్రజలు ఎక్కువగా బాధ పడుతున్న వ్యాధులకు వేగంగా చికిత్స అందే విధంగా చర్యలు చేపడుతుండటం గమనార్హం.