Tag Archives: 12 cities under water

రానున్న రోజుల్లో విశాఖపట్నం మునిగిపోనుందా.. ఇందులో నిజమెంత..?

వైజాగ్ సముద్రంలో మునిగిపోతుందన్న వార్త గత రెండు రోజుల నుంచి వినపడుతోంది. రానున్న 80 సంవత్సరాల్లో వైజాగ్ మూడు అడుగుల నీటిలో ఉంటుందని.. ఆ తర్వాత కనుమరుగయ్యే ప్రమాదముందని ఓ నివేదిక తేల్చింది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ (ఐపీసీసీ) ఇచ్చిన ఈ నివేదిక భయాందోళనకు గురిచేస్తోంది. విశాఖపట్నంతో పాటు దేశంలోని 12 నగరాలు దాదాపు మూడు అడుగుల మేర సముద్రపు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉందని ఐపీసీసీ నివేదిక అంచనా వేసింది.

అయితే నిపుణులు మాత్రం తూర్పు కనుమల కొండ ప్రాంతాలు సముద్రానికి అడ్డుగా ఉండటం వల్ల.. నగరం మునిగిపోయే అవకాశం లేదని విశ్లేషిస్తున్నారు. సుమద్రం మట్టం అనేది పెరుగుతంది.. కానీ ఒకే స్థాయిలో పెరగదని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ హెడ్ జీపీఎస్ మూర్తి తెలిపారు.

ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ నివేదిక కేవలం అంచనా మాత్రమే అని.. అది వాతావరణ మార్పులపై మాత్రమే ఆధారపడి ఉంటాయని మూర్తి చెప్పారు. రాబోయే కాలంలో వాతావరణ మార్పులు అనేవి చోటుచేకుంటాయని.. లోతట్టు ప్రాంతాలైన నెల్లూరు, చెన్నైలలోని అనేక ప్రాంతాలను ముంచెత్తుతుందని.. కానీ విశాఖపట్నంలోని సముద్ర జలాలు బీచ్ రోడ్డును కూడా చేరుకోలేవని మూర్తి విశ్లేషించారు.

భౌగోళిక స్థానాలు అనుకూలంగా ఉండటమే దీనికి కారణం అని మూర్తి వివరించారు. సుమద్రపు తీర ప్రాంతాలైన చెన్నై, మంగళూరు, ముంబై, విశాఖపట్నం 2100 నాటికి సముద్రంలో మునిగిపోతాయని ఐపీసీసీ నివేదిక అంచనా వేయడంతో వీటిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది.