Tag Archives: 134 types of food

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘వంటలక్క’పేరు.. ఇంతకు ఆమె ఏం చేసిందంటే..!

వంటలక్క అని పేరు వినగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది కార్తీక దీపం సీరియల్ లోని దీప క్యారెక్టర్. అంతలా ఆమె ప్రతీ ప్రేక్షకుడి మదిలో నిండిపోయారు. ఆ నటన అంతలా మంత్ర ముగ్ధులను చేసింది. కానీ ఇక్కడ చెప్పుకునే వంటలక్క వేరు.

ఇక్కడ తమిళనాడులోని మదురై తిరుమంగళానికి చెందని ఇందిరా రవిచంద్రన్ తన వంటలతో సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఇంతకు ఆమె చేసింది.. ఎంటో తెలుసా.. ఆ మహిళ అరగంట సమయంలోనే 134 రకాల ఆహార పదర్ధాలను తయారు చేసి ఔరా.. అనిపించింది.

దీంతో ఆమె ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో రికార్డు సొంతం చేసుకున్నారు. అంతకు ముందు ఈ రికార్డు అరగంటలో 122 రకాల వంటలను తయారు చేసి కేరళకు చెందిన 10 ఏళ్ల బాలుడు హాయెన్ పేరిట ఉండేంది. తాజాగా ఆ రికార్డును 134 రకాల వంటలలో వెజ్, నాన్ వెజ్ తయారు చేసి అతడి రికార్డును చెరిపేసి సరికొత్త రికార్డును స్పష్టించారు. దీంతో ఆమెకు పలు ఛానల్ లు అవకాశం కల్పిస్తున్నాయి.

లైవ్ కార్యక్రమాల్లో వంటలకు సంబంధించి ప్రోగ్రామ్ లు చేసేందుకు ఆమెకు ఆఫర్లను ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆమె రికార్డు నెలకొల్పే ముందు ఎంతో శ్రమించిందట. చాలా రోజుల శిక్షణ తర్వాత ఈ అరుదైన గౌరవం దక్కిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తాను చేసిన వంటకాల్లో ఇడ్లీ, దోశ, వడ లాంటి వంటకాలతో పాటు మాంసహార వంటకాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.