Tag Archives: Aadhaar Pay

Aadhar Pay: ఫోన్ పే, గూగుల్ పేతో పాటు..! ఇక నుంచి ఆధార్ పే కూడా..!

Aadhar Pay: క్యాష్ లెస్ డిజిటల్ లావాదేవీలు ఇండియాలో గణనీయంగా పెరిగాయి. డిజిటల్ లావాదేవీల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. భారత దేశంలో డిజిటల్ పేమెంట్లు ఎంతగా మారాయంటే… దేవాలయాల్లో హుండీలకు కూడా క్యూఆర్ కోడ్ లు వచ్చే అంతగా మార్పు చెందాయి.

ప్రస్తుతం దేశంలో గుగూల్ పే, ఫోన్ పే, భీమ్ ద్వారా నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. 
తాజాగా త్వరతలో ‘ ఆధార్ పే’ కూడా రానుంది. గుగూల్ పే, ఫోన్ పే లాగే ఆధార్ పే చేసుకోవచ్చు. అన్ని ఎంఓఎస్ డిజిటల్ కేంద్రాల వద్ద ఆధార్ పే ద్వారా చెల్లింపులు జరుపుకునే వెసులుబాటు కలిగింది.

బయోమెట్రిక్ మెషిన్ల ద్వారా ఆధార్ నెంబర్ ఆధారిత ఆర్థిక లావాదేవీలు జరుపుకునే వీలు ఉంది. ఈ సౌకర్యాన్ని ఎంఎస్ఓ యుటిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అందుబాటులోకి తేనుంది. బయోమెట్రిక్ యంత్రాల ద్వారా ఆధార్ నంబర్ ఆధారంగా ఆర్థిక లావాదేవీలు జరుగనున్నాయి.

బ్రాంచ్ లెస్ బ్యాంకింగ్ టై అప్ ల ద్వారా..


దీని వల్ల నగదు రహిత లావాదేవీలకు మరింత ముందడుగు పడనుంది. ఇప్పటికైతే వెండర్ ‘ ఆధార్ పే’ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఈ లావాదేవీలకు ఆధార్ నెంబర్ ఖచ్చితంగా బ్యాంకు ఖాతాాకు లింక్ అయి ఉండాలి.  ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కోసం యూనిక్ ఫింగర్ ఇంప్రెషన్ వాడుకోనుంది. ఈ ఫింగర్ వెరిఫికేషన్ ద్వారా బ్యాంకు నుంచి నగదు బదిలీ జరుగుతుంది. బ్రాంచ్ లెస్ బ్యాంకింగ్ టై అప్ ల ద్వారా వినియోగదారుడు తమ ఇళ్ల సమీపం నుంచే బ్యాంకింగ్ సేవలను పొందే అవకాశం ఏర్పడింది. దేశంలోని మారుమూల, సుదూర ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్ సేవలను విస్తరించడంలో ఇది కీలక ముందుడుగా అభివర్ణించవచ్చు.