Tag Archives: after 75 long

ఆ ఊరిలో 75 ఏళ్లకు బ్యాంకింగ్ సేవలు.. బ్రిడ్జి నిర్మాణంతో అందుబాటులోకి..

మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది.. కానీ అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడూ చెప్పుకోలేదు. ఇంకా కొన్ని గ్రామాల్లో, పట్టాణాల్లో అభివృద్ధి ఫలాలు, ప్రభుత్వ పథకాలు అందని పరిస్థితి నెలకొంది. అటువంట కోవలోకి చెందిందే.. ఒడిశాలోని సంబాల్‌పూర్‌ జిల్లాలోని కుద్‌ గుండేర్‌పూర్‌ గ్రామం. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లకు ఇక్కడ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఇక్కడ మహానది పాయలుగా విడిపోయి కుద్‌ గుండేర్‌ఫూర్ ఒక దీవిలో ఉంది. దీంతో వాళ్లు ప్రధాన భూభాగంతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. అక్కడ జనాభా 5 వేల మంది ఉంటారు. అక్కడ ప్రభుత్వ పథకాలు కూడా సరిగా అందడం లేదు. రవాణా, విద్య, ఆరోగ్య సంరక్షణ సోకర్యాలను పొందడంలో అక్కడ అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. గర్భిణుల ఇబ్బందులు చెప్పుకోలేని స్థితిలో ఉన్నాయి. రైతులు పండించిన పంటలను ఎక్కడ విక్రయించాలో తెలియని దుస్థితి.

వారు అక్కడ నుంచి పడవలో ప్రధాన భూభాగానికి చేరి అక్కడ విక్రయించేవారు. ఈ సమస్యలన్నీ సంబాల్ పూర్ జిల్లా కలెక్టర్ దృష్టికి చేరాయి. అక్కడ 2015లో వంతెన నిర్మాణాన్ని నిర్మించి వేగవంతం చేశారు. గతేడాది ఫిబ్రవరిలో ఆ ఉరిని ప్రధాన భూభాగంతో కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం పూర్తైంది. దీంతో అక్కడ బ్యాంకింగ్ సేవలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆ ఊరిలో ఉత్కల్ గ్రామీణ బ్యాంకు కస్టమర్ సర్వీస్ పాయింట్ ను ఏర్పాటు చేసింది.

ఈ విధంగా ఆ గ్రామానికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వంతెన నిర్మాణం పూర్తవడంతో వాళ్లు ప్రధాన భూభాగానికి చేరుకున్నారు. తర్వాతనే వారికి పలు రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయని.. జిల్లా కలెక్టర్‌గా ఉన్న సుకాంత్ త్రిపాఠి పేర్కొన్నారు. ఇతర అవసరాల కోసం ప్రధాన భూభాగానికి చేరుకోవడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి చిన్న పడవల్లో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ 75 సంవత్సరాలలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగవని కలెక్టర్ అన్నారు.