మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది.. కానీ అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడూ చెప్పుకోలేదు. ఇంకా కొన్ని గ్రామాల్లో, పట్టాణాల్లో అభివృద్ధి ఫలాలు, ప్రభుత్వ పథకాలు అందని పరిస్థితి నెలకొంది. అటువంట కోవలోకి చెందిందే.. ఒడిశాలోని సంబాల్‌పూర్ జిల్లాలోని కుద్ గుండేర్‌పూర్ గ్రామం. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లకు ఇక్కడ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఇక్కడ మహానది పాయలుగా విడిపోయి కుద్ గుండేర్‌ఫూర్ ఒక దీవిలో ఉంది. దీంతో వాళ్లు ప్రధాన భూభాగంతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. అక్కడ జనాభా 5 వేల మంది ఉంటారు. అక్కడ ప్రభుత్వ పథకాలు కూడా సరిగా అందడం లేదు. రవాణా, విద్య, ఆరోగ్య సంరక్షణ సోకర్యాలను పొందడంలో అక్కడ అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. గర్భిణుల ఇబ్బందులు చెప్పుకోలేని స్థితిలో ఉన్నాయి. రైతులు పండించిన పంటలను ఎక్కడ విక్రయించాలో తెలియని దుస్థితి.
వారు అక్కడ నుంచి పడవలో ప్రధాన భూభాగానికి చేరి అక్కడ విక్రయించేవారు. ఈ సమస్యలన్నీ సంబాల్ పూర్ జిల్లా కలెక్టర్ దృష్టికి చేరాయి. అక్కడ 2015లో వంతెన నిర్మాణాన్ని నిర్మించి వేగవంతం చేశారు. గతేడాది ఫిబ్రవరిలో ఆ ఉరిని ప్రధాన భూభాగంతో కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం పూర్తైంది. దీంతో అక్కడ బ్యాంకింగ్ సేవలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆ ఊరిలో ఉత్కల్ గ్రామీణ బ్యాంకు కస్టమర్ సర్వీస్ పాయింట్ ను ఏర్పాటు చేసింది.
ఈ విధంగా ఆ గ్రామానికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వంతెన నిర్మాణం పూర్తవడంతో వాళ్లు ప్రధాన భూభాగానికి చేరుకున్నారు. తర్వాతనే వారికి పలు రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయని.. జిల్లా కలెక్టర్‌గా ఉన్న సుకాంత్ త్రిపాఠి పేర్కొన్నారు. ఇతర అవసరాల కోసం ప్రధాన భూభాగానికి చేరుకోవడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి చిన్న పడవల్లో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ 75 సంవత్సరాలలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగవని కలెక్టర్ అన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…