బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. మళ్లీ మోనిత దీపను చంపడానికి ప్లాన్ చేయడంతో కథ మొత్తం ఆసక్తిగా మారింది. రేటింగ్ కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ కు బాగా అలవాటుపడ్డారు.
ఇదిలా ఉంటే ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటో చూద్దాం. సోదమ్మ గెటప్ లో మోనిత దీపను చంపడానికి క్యాబ్ లో బయల్దేరగా క్యాబ్ డ్రైవర్ మోనిత మాటలు విని షాక్ అవుతాడు. ఇక దీప గుడికి వస్తే ఇదే ఆఖరి రోజు అవుతుందని మోనిత అనుకుంటుంది.
ఇక గుడిలో భాగ్యం, మురళి కృష్ణ పూజారితో తమ బాధలను గురించి మాట్లాడతారు. ఇక దూరంగా మోనిత గమనిస్తూనే ఉంటుంది. దీప లేదని వెతుకుతుంది. తమ దీపని జాగ్రత్తగా చూసుకోమని దేవుడిని వేడుకుంటాడు మురళికృష్ణ.
మోనితకు.. భాగ్యం, మురళీకృష్ణ కనిపించేసరికి దీప రాలేదని.. వాళ్లు మాట్లాడేది వింటే దీప గురించి ఏమైనా తెలుస్తుందని ఓ చోట ఉండి వింటుంది. ఇక మురళి కృష్ణ.. దీపకు పని ఉండి ఆగిపోయిందని అందుకే రాలేదని అంటాడు.దీప కష్టాలకు పరిష్కారం పూజారిని కోరుకుంటారు.
ఇక పూజారి రేపు ఉదయం దీపతో అఖండ దీపం వెలిగించి హోమం చేయిస్తాను.. అంతా మంచే జరుగుతుంది అని వాళ్లకు ధైర్యం ఇస్తాడు. ఇప్పుడే వెళ్లి దీపకు చెబుతాను అని అక్కడి నుంచి బయలుదేరుతారు భాగ్యం, మురళికృష్ణ.
ఈ మాటలు అన్నీ విన్న మోనిత దీప రేపు వస్తుందని.. అయితే రేపే దీపకు చివరి రోజు అని అనుకుంటు నవ్వుతూ.. అంతవరకు వీళ్ళతో ఓ ఆట ఆడుకుంటాను అని అనుకుంటుంది.
మరోవైపు దీప పిల్లలతో కారులో వస్తున్న సమయంలో.. పిల్లలు పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇక వెంటనే మళ్లీ పిల్లలు తన తండ్రి గురించి మాట్లాడుతుంటారు. అక్కడ తన తండ్రిని చీప్ గా చూస్తున్నారు అని దీపతో మాట్లాడుతుంటారు.
ఇక పిల్లల మాటలు విని దీప మంచిగా చదుకోమని నాన్న చెప్పాడు కదా.. అందుకు మంచిగా చదువుకోండి అని అంటుంది. నాన్నను బయటకు ఎలా తీసుకురావాలో నేను చూసుకుంటాను అని అంటుంది దీప.
ఇక మోనిత గుడిలో కూర్చొని సోదమ్మా లాగా సోది చెబుతాను అంటూ..ఉన్నది ఉన్నట్టుగా.. జరిగింది జరిగినట్టుగా .. జరగబోయేది చెబుతాను అని అంటుంది. ఇక భాగ్యం, మురళీకృష్ణ పట్టించుకోకుండా వెళ్లిపోతుంటే మళ్లీ వాళ్లకు వినబడేలా అరుస్తుంది మోనిత.
ఇక భాగ్యం అక్కడికెళ్లి చెప్పించుకుందామని.. మురళీకృష్ణ తో బ్రతిమాలుతుంది. మురళి కృష్ణ మాత్రం అసలు ఒప్పుకోడు. ఇక భాగ్యం వినకుండా మురళి కృష్ణను సోదమ్మ దగ్గరికి తీసుకెళ్తుంది. వాళ్ల రాకను చూసి మోనిత మీకోసమే ఎదురుచూస్తున్నాను అని అనుకుంటుంది.
ఇక శౌర్య, హిమ దీపతో రోషిణి గురించి.. తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ.. ఆమె పద్ధతి మంచిగా లేదని అనేసరికి.. ఆమె డ్యూటీ ఆమె చేస్తుందమ్మ అని దీప అంటుంది. గతంలో రోషిణి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకొని నాన్న కోసమే వచ్చింది అంటుంది శౌర్య.
పిల్లలు మాత్రం ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. దీప ఆ విషయాలు అన్ని పట్టించుకోకుండా ఉండండి అని ఇంట్లోకి తీసుకెళ్తుంది. మోనిత సోదమ్మ మాటలతో భాగ్యం ను నమ్మిస్తుంది.
పరిష్కారం దొరికింది అంటూ.. నేను చెప్పినట్టు చెయ్యి అని రేపు ఉదయం గుడికి రమ్మని చెబుతుంది. వెంటనే భాగ్యం నేను కూడా వస్తాను అనేసరికి తన మాటలతో భాగ్యంను రాకుండా చేస్తుంది. ఇక మోనిత దీప చావుకు ముహూర్తం పెట్టుకున్నట్లు తెలుస్తుంది.
ఇక రోషిణి.. కార్తీక్ ను పిలిచి మాట్లాడుతుంది. మోనిత గురించి ప్రశ్నలు వేస్తుంది. కార్తీక్ మాత్రం తన తప్పులేదు అన్నట్లు సమాధానాలు చెబుతాడు. కార్తీక్ ఉన్న నిజం చెప్పేసరికి రోషిణి కోపం తో అరుస్తుంది. కార్తీక్ మాత్రం నిజాయితీగా సమాధానం చెబుతున్నాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…