Categories: FeaturedMovie News

ఎన్నో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి.. వాటిని తట్టుకొని నేడు ఈ స్థాయిలో ఉన్నానంటూ..

ఒకప్పుడు ఎంతో ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లు.. ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టడంతో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. దీనికి ఎవరూ అతీథులు కాదు. ఎవరికైనా కష్టాలు రావచ్చు. అటు టాలీవుడ్, బాలీవుడ్, సాధారణ ప్రజలకు కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చెప్పుకునే విషయం ఏంటంటే.. తెలుగులో ‘ఆహా కళ్యాణం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బ్యూటీ వాణీకపూర్. కానీ ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో ఆమెను నిరాశకు గురిచేసింది. తర్వాత తెలుగులో సినిమా ఆఫర్లు రాలేదు.

కానీ బాలీవుడ్ లో మాత్రం ఆమె హవా కొనసాగింది. అక్కడ కొన్ని వరుస హిట్లతో తన పొజిషన్ ని ఇప్పుడు సుస్థిరం చేసుకుంది. శుధ్ దేశీ రొమాన్స్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన వాణి కపూర్.. తర్వాత బేఫిక్రే..వార్ లాంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకుని ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ఆమెకు సంబంధించి ఓ సీక్రెట్ ఇప్పుడు అభిమానులకు షాక్ ను గురిచేస్తోంది. కపూర్ వంశస్తురాలిగా బాలీవుడ్ కి పరిచయమైన ఈ అమ్మడికి కూడా అందరిలానే కష్టాలు ఒడిదుడుకులు ఉన్నాయి. 19 సంవత్సరాల వయస్సులో ఆమె తన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

వాళ్ల కుటుంబసభ్యులు ఆర్థిక కష్టాలు భరించలేక ఎంతగానో కుమిలిపోయారని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఆమె తన కుటుంబానికి అండగా నిలబడాలనే నిశ్చయంతో స్వయంగా కుటుంబ బాధ్యతలు నెత్తిన వేసుకున్నానని వాణీ చెప్పుకొచ్చింది. సనిమాలో నటిగా ఎదిగే సమయంలో ఇంటి నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని.. తానే ఎన్నో ఆటుపోటులను తట్టుకొని నేడు ఈ స్థాయికి వచ్చానని చెప్పింది. మోడలింగ్ లోకి రావడానికి కారణం కూడా ఆర్థిక కష్టాలే అని చెప్పింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సరసన బెల్ బాటమ్ లో నటించింది.

ఈ సనిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఒక సనిమాలో నటిస్తున్న ఈ బామ.. షామ్ శ్రీ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. టాలీవుడ్ లో ఆమెకు లక్ కలసిరాలేదనే చెప్పాలి. అయితే తాజాగా ఆమె టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చి.. సలార్ లాంటి భారీ క్రేజీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా జరిగింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago