Tag Archives: akkineni amala

Akkineni Amala: ఒకరు తప్పు చేస్తే అందరిని శిక్షిస్తామా… అంబర్ పేట్ ఘటనపై స్పందించిన అమల!

Akkineni Amala: హైదరాబాద్ అంబర్ పేట్ వీధి కుక్కల ఘటన ఒక్కసారిగా అందరిని ఎంతగానో కలిచి వేసింది.వీధి కుక్కల దాడి ఘటనలో భాగంగా చిన్నారి ప్రదీప్ మరణించిన విషయం మనకు తెలిసింది. అయితే ఈ ఘటనపై ఇప్పటికే ఎంతోమంది స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు.

ముఖ్యంగా జంతు ప్రేమికులు ఈ ఘటనపై స్పందిస్తూ కుక్కలకే సపోర్ట్ చేస్తూ మాట్లాడటంతో నేటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. యాంకర్ రష్మీ కుక్కలకు సరైన వసతి కల్పిస్తే ఇలాంటివి జరగవు కదా అంటూ ఆమె కుక్కలకే మద్దతుగా మాట్లాడటంతో నేటిజన్స్ ఆమెను ఏకంగా కుక్కతో పోలుస్తూ ట్రోల్ చేశారు.

ఇకపోతే ఈ ఘటనపై జంతు ప్రేమికురాలు, బ్లూ క్రాస్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ నిర్వాహకులు, నటి అక్కినేని అమల స్పందించినట్టు తెలుస్తుంది.అయితే ఈమె వీధి కుక్కల గురించి గతంలో చేసినటువంటి కామెంట్లకు సంబంధించిన ఫోటోలను సురేఖ వాణి కూతురు సుప్రీత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో భాగంగా అమల కుక్కలపై తనకు ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరిచారు.

Akkineni Amala: మనకు శత్రువులు కాదు….


ఈ క్రమంలోనే ఒక కుక్క తప్పు చేస్తే అన్ని కుక్కలను శిక్షించడం సరైనది కాదు…ఒక మనిషి తప్పు చేశాడని మానవజాతిని శిక్షించలేము కదా అలాగే కుక్కలను కూడా అంతే అవి మనకు శత్రువులు కావు… అవి మనతో ఎంతో నమ్మకంగా ఉండి మనలను రక్షిస్తుంటాయి అంటూ ఈమె చేసినటువంటి కామెంట్లకు సంబంధించిన పోస్టును సుప్రీత షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

Mega Daughters: కళామందిర్ రాయల్ బ్రాండ్ ప్రారంభించిన మెగా డాటర్స్!

mega daughters: హైదరాబాద్ లో “కళామందిర్ రాయల్” బ్రాండ్ ఘనంగా ప్రారంభం అయింది. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్ 36లో ఇది అందుబాటులోకి వచ్చింది. దీనిని ప్రముఖ నటి, సామాజిక వేత్త అమల అక్కినేని, సుష్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల స్టోర్ ప్రారంభించారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో దివ్య రెడ్డి, దీపికా రెడ్డి, పద్మజ ల్యాంకో, శుభ్ర మహేశ్వరి, కల్పన తదితరులు హాజరయ్యారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో చీరల రిటైల్ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన బ్రాండ్ కళామందిర్. ఇది ఇప్పుడు జూబ్లీహిల్స్‌ రోడ్ నెం.36లో తన కొత్త ప్రీమియం బ్రాండ్ “కళామందిర్ రాయల్” గ్రూప్ 49వ షోరూమ్‌తో ముందుకు వచ్చింది. కొత్త బ్రాండ్ కళామందిర్ కి అప్‌ గ్రేడ్ వెర్షన్. ఇది ఎంపిక చేసిన ప్రత్యేకమైన పట్టు సేకరణకు ప్రసిద్ధి చెందింది. కళామందిర్ రాయల్ అనేది చేతితో ఎంపిక చేసిన పట్టు, పైథాని, పటోలా, చేనేత, కోటా, డిజైనర్, ఖాదీ చీరల కోసం ఒక సరికొత్త స్టోర్. కొత్త స్టోర్ ఒక రకమైన ప్రీమియం ఎలివేషన్ మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇంటీరియర్‌లను ఆకర్షణీయంగా కలిగి వుంటుంది.

పేరు సూచించినట్లుగా, కళామందిర్ రాయల్ అనేది స్త్రీకి చీరల దేవాలయం, ఆమె తనకు మునుపెన్నడూ లేని. అందాన్ని జోడించుకోవాలని కోరుకుంటుంది. ఇది మహిళలకు కొత్త నివాసం, వారికి ప్రత్యేకంగా రూపొందించిన చీరలను తీసుకువస్తుంది. ఇక్కడ ఉన్న చీరలు స్త్రీల కోసం ప్రతిభావంతులైన నేత కార్మికులతో అంతర్గత డిజైనర్ల సమక్షంలో నేస్తారు. ఇక్కడ ఉన్న చీరలు ఇతర డిజైనర్ బ్రాండ్‌లకు భిన్నంగా ఉంటాయి, ఎందుకంటే అవి సరసమైన ధర ట్యాగ్‌లతో మీకు అందుబాటులో వుంటాయి.

ఈ సందర్భంగా కళామందిర్ రాయల్ డైరెక్టర్ కళామందిర్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కళామందిర్ రాయల్ దివ్యమైన ప్రదేశమని, నేటి మహిళా ప్రమాణాలకు తగ్గట్టుగా అత్యంత నిశితంగా, అపూర్వంగా రూపొందించిన ఉత్పత్తులు కళామందిర్ రాయల్ మొదటి స్థానంలో నిలుస్తాయన్నారు. ప్రత్యేకమైన, ప్రత్యేకమైన చీరల సేకరణను ఇష్టపడే నగర మహిళల కోసం ఈ స్టోర్ ఏర్పాటు చేశాం అన్నారు”

Amala Akkineni : అక్కినేని అమల అమ్మ ఏ దేశానికి చెందిన వారో తెలుసా? నాన్న ఎక్కడివారంటే..?

Amala Akkineni : అక్కినేని అమల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరూ ఉండరు. హలో గురూ.. ప్రేమ కోసమేరో జీవితం అనే పాటలో ఆమె చూపించిన అందం, అభినయం ఇప్పటికీ చాలామంది మెదళ్ళలో చెక్కుచెదరకుండా ఉందంటే అతిశయోక్తి కాదు. నాగార్జున ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమా పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యారు అమల. బ్లూ క్రాస్ అనే ఒక జంతువుల పరిరక్షణ కేంద్రాన్ని స్థాపించి తనకి మూగజీవాల పై ఉన్న ప్రేమను చాటుకున్నారు.

1986వ సంవత్సరంలో సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన అక్కినేని అమల టి. రాజేందర్ దర్శకత్వం వహించిన మిథిలి ఎన్నై కాథలి సినిమాలో తొలిసారిగా నటించగా అది బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఒక్క రాత్రిలోనే అశేషమైన ఖ్యాతిని గెలుచుకున్న ఆమె సినీ ప్రేక్షకులను యాభై చిత్రాలతో విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇందులో అనేక తమిళ బ్లాక్ బాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. ఉల్లాడక్కం మలయాళ చిత్రంలో ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. ఆమె తన కాబోయే భర్త అక్కినేని నాగార్జునతో కలిసి నిర్ణయం, శివ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.

ఆ సమయంలోనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టుకొచ్చింది. కానీ అప్పటికే నాగార్జున వెంకటేష్ సోదరి అయిన దగ్గుబాటి లక్ష్మి ని వివాహం చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే అమల పై ప్రేమ పెంచుకున్నారో ఆ క్షణమే ఆమెకు విడాకులు ఇచ్చేశారు. నాగార్జున ని పెళ్లి చేసుకున్న తర్వాత అమల హైదరాబాదు నగరానికి శాశ్వతంగా మకాం మార్చేశారు. వివాహానంతరం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మనం లాంటి ఒకటి రెండు సినిమాల్లో నటించారు కానీ ఆ సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలు కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు.

అమల తండ్రి బెంగాలీ నేవీ ఆఫీసర్ ముఖర్జీ కాగా… తల్లి ఐర్లాండ్ దేశానికి చెందిన మహిళ. అమల తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నేవీ ఆఫీసర్ గా పనిచేసిన అతను ఆ తర్వాత డిప్యుటేషన్ మీద ఐఐటీ ఖరగ్పూర్ లో ప్రొఫెసర్ ఉద్యోగం సంపాదించారు. అమల తల్లి మెహ్యు హాస్పటల్ మేనేజ్మెంట్ జాబ్ చేసేవారు. వివాహానంతరం అమల తల్లిదండ్రులు వైజాగ్, చెన్నై వంటి ప్రదేశాల్లో చాలా కాలం వరకు జీవనం సాగించారు.

అక్కినేని అమల సినిమాలలోకి రాకముందు ఏం చేసేదో తెలుసా?

నటి అమల తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జునను రెండో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అప్పట్లో నాగార్జున అమలను పెళ్లి చేసుకోవడంతో సినిమా ఇండస్ట్రీతో పాటు,ఆయన అభిమానులు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. నాగార్జున తెలుగుహీరోగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు అలాంటిది ఒక తెలుగు హీరో వేరే భాష అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అదే మొదటిసారి కావడంతో అప్పట్లో నాగార్జున పెళ్లి ఒక సంచలనం అని చెప్పవచ్చు.

అప్పటికి నాగార్జున నిర్మాత రామానాయుడు కుమార్తె లక్ష్మిని వివాహం చేసుకున్నారు. కొన్ని అభిప్రాయ భేదాల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకోవడంతో 1992 వ సంవత్సరంలో నాగార్జున అమలను వివాహం చేసుకున్నారు. అమల నాగార్జునతో కలిసి తెలుగులో నటించిన మొట్టమొదటి చిత్రం “కిరాయి దాదా”. అమలకు తెలుగులో మొదటి చిత్రం కూడా ఇదే.అయితే అప్పటికే తమిళంలో సుమారు పదిహేను సినిమాల వరకు నటించింది. అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించిన అమలకు ఇండస్ట్రీలోకి రావాలనే ఆలోచన లేదని ఓ సందర్భంలో తెలియజేశారు.

అమల తల్లి ఐరిష్ అమ్మాయి కాగా, తండ్రి బెంగాలీ వ్యక్తి. ఈ క్రమంలోనే అమ్మాయిలకు ప్రఖ్యాత నాట్యకారుడు ఉదయ్ శంకర్ భార్య పేరు అమల. ఆ పేరే ఆమెకు పెట్టారు. ఈ క్రమంలోనే అమలకి కూడా చిన్నప్పటి నుంచి నాట్యం అంటే ఎంతో ఇష్ట పడుతూ నాట్యం నేర్చుకుంది. ఒకవైపు నాట్యం నేర్చుకుంటూనే మరోవైపు తన చదువును కొనసాగించడం కోసం అమల తల్లిదండ్రులు ఆమెను కళాక్షేత్రలో చేర్పించారు.

ఈ కళాక్షేత్ర తరఫున అమల మన దేశంలో ఉన్న ప్రధాన నగరాల అన్నింటిలో కూడా ఈమె నాట్య ప్రదర్శన చేశారు. మన దేశంలో మాత్రమే కాకుండా పాశ్చాత్య దేశాలలో కూడా ఈ నాట్య ప్రదర్శన చేశారు. ఈ విధంగా డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకున్న అమలను రాజేందర్ అనే డైరెక్టర్ ఆమె నాట్య ప్రతిభను చూసి ఆమెకు మొట్టమొదటిగా సినిమాల్లో అవకాశాలు కల్పించారు. ఈ విధంగా అమల అనుకోకుండా సినిమాలలోకి వచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత తెలుగులో నాగార్జునతో కలిసి సినిమాలలో నటించి నాగార్జునను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.