Tag Archives: among us

వామ్మో.. ఒక్క చికెన్ ముక్క రూ.73 లక్షలా?

ప్రస్తుత కాలంలో చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. వారానికి కనీసం మూడు నాలుగు సార్లు అయినా చికెన్ తో వివిధ రకాల వెరైటీలను తయారు చేసుకొని తింటాము. చికెన్ అంటే ఎంత ఇష్టం ఉన్నప్పటికీ మనం చికెన్ కోసం ఒక 500 వరకు పెట్టాలంటే ఆలోచిస్తాము. ఇక తప్పనిసరి పరిస్థితులలో వెయ్యి రెండు వేలు వరకు సాహసం చేసి ఖర్చు చేస్తాము. కానీ కేవలం ఒకే ఒక చికెన్ పీస్ కోసం ఏకంగా 73 లక్షల రూపాయలను ఖర్చు చేయడం మీరు ఎప్పుడైనా విన్నారా? వామ్మో చికెన్ కోసం 73 లక్షలా? అని ఆశ్చర్యపోకండి.కేవలం ఒకే ఒక చికెన్ ముక్కను ఇంత ఖరీదు చేసి కొనడానికి ఆ చికెన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్ ఫుడ్ వంటకాలలో తమకంటూ ఎంతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న మెక్‌డోనాల్డ్స్ సంస్థ తమ చికెన్ నగ్గెట్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు.ఈ సంస్థ ఎంతో ప్రత్యేకంగా తయారు చేసిన కేవలం ఒకే ఒక చికెన్ నగ్గెట్‌ ఏకంగా 99,997 డాలర్ల ధర అనగా మన కరెన్సీ ప్రకారం సుమారు 73 లక్షల రూపాయలు పలకడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అక్షరాల 73 లక్షల రూపాయల విలువ చేసే ఈ చికెన్ ముక్క ప్రాముఖ్యత ఏమిటో ఎందుకు అంత ఖర్చు చేసే కొనాల్సి వచ్చిందో తెలుసుకుందాం.మెక్‌డోనాల్డ్స్ సంస్థ చికెన్ నగ్గెట్‌ను ‘అమాంగ్ అస్’ అనే ఓ వీడియో గేమ్ లోని ఒక పాత్ర ఆధారంగా తయారు చేశారు. ఇక ఈ గేమ్ అంటే ఇష్టపడే చికెన్ ప్రేమికులు ఎలాగైనా ఆ చికెన్ ముక్కను సొంతం చేసుకోవాలని తీవ్ర పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే ఉటాకు చెందిన పోలిజ్నా అనే వ్యక్తి రూ.72 లక్షలకు కొనుగోలు చేయడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రపంచంలోనే పాపులర్ గేమ్ ఇదే.. ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే..?

ఆన్ లైన్ గేమ్స్ ను ఎక్కువగా ఇష్టపడేవాళ్లు కొత్త కొత్త గేమ్స్ కోసం ఎప్పుడూ వెతుకుతూ ఉంటారు. అయితే గేమింగ్ ప్రియులకు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన కొన్ని గేమ్స్ గురించి అవగాహన ఉండదు. అయితే ఎన్నో పాపులర్ ఆన్ లైన్ గేమ్స్ గేమ్స్ ను ఇష్టపడేవాళ్లకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. అలా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన గేమ్స్ లో అమాంగ్ అస్ గేమ్ కూడా ఒకటి. పిల్లలు, పెద్దలు అనే తేడాల్లేకుండా అందరూ ఈ గేమ్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ప్రతిరోజూ కొన్ని కోట్ల మంది ఆన్ లైన్ లో ఆడే గేమ్స్ లో అమాంగ్ అస్ కూడా ఒకటి. ఇంగ్లీష్ లో “among as” గా పిలిచే ఈ గేమ్ రెండు సంవత్సరాల క్రితం లాంఛ్ అయింది. సంవత్సరం సంవత్సారానికి ఈ గేమ్ ను ఆడేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్లలో అమాంగ్ అస్ గేమ్ ను ఉచితంగా ఆడే అవకాశం ఉంటుంది. అయితే ఎవరైనా పీసీలో ఆడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నగదు చెల్లించాలి.

గతంలో పాపులర్ అయిన గేమ్స్ ను సైతం వెనక్కు నెట్టి అమాంగ్ అస్ గేమ్ మొదటి స్థానంలో నిలిచింది. 1 జీబీ ర్యామ్, విండోస్ 7 ఓఎస్ ఉన్న సిస్టమ్ లలో కూడా ఈ గేమ్ ను సులభంగా ఆడవచ్చు. ఈ గేమ్ సైజ్ 70 ఎంబీ కాగా ఆండ్రాయిడ్ వెర్షన్ 4.4 కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఐ ఫోన్లలో గేమ్ సైజ్ 190 ఎంబీ కాగా 10.0 కంటే ఎక్కువ ఉండే ఐఓఎస్ ఉండాలి. ఒకే గదిలో పది మంది అమాయకులు, ఇంపోస్టర్ లు ఉంటారు.

ఈ ఇంపోస్టర్లను పట్టుకోవడమే మిగతా వారి లక్ష్యం. ఎటువంటి గేమింగ్ స్కిల్స్ లేకపోయినా ఈ గేమ్ ను సులభంగా ఆడవచ్చు. ఈ గేమ్ ను ఎప్పటికప్పుడు మరింత డెవలప్ చేస్తూ ఉండటంతో గేమింగ్ ప్రియులను ఈ గేమ్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. యాప్ స్టోర్ల ద్వారా ఈ గేమ్ ను సులువుగా డౌన్ లోడ్ చేసుకొవచ్చు.