ప్రస్తుత కాలంలో చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. వారానికి కనీసం మూడు నాలుగు సార్లు అయినా చికెన్ తో వివిధ రకాల వెరైటీలను తయారు చేసుకొని తింటాము. చికెన్ అంటే ఎంత ఇష్టం ఉన్నప్పటికీ మనం చికెన్ కోసం ఒక 500 వరకు పెట్టాలంటే ఆలోచిస్తాము. ఇక తప్పనిసరి పరిస్థితులలో వెయ్యి రెండు వేలు వరకు సాహసం చేసి ఖర్చు చేస్తాము. కానీ కేవలం ఒకే ఒక చికెన్ పీస్ కోసం ఏకంగా 73 లక్షల రూపాయలను ఖర్చు చేయడం మీరు ఎప్పుడైనా విన్నారా? వామ్మో చికెన్ కోసం 73 లక్షలా? అని ఆశ్చర్యపోకండి.కేవలం ఒకే ఒక చికెన్ ముక్కను ఇంత ఖరీదు చేసి కొనడానికి ఆ చికెన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్ ఫుడ్ వంటకాలలో తమకంటూ ఎంతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న మెక్‌డోనాల్డ్స్ సంస్థ తమ చికెన్ నగ్గెట్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు.ఈ సంస్థ ఎంతో ప్రత్యేకంగా తయారు చేసిన కేవలం ఒకే ఒక చికెన్ నగ్గెట్ ఏకంగా 99,997 డాలర్ల ధర అనగా మన కరెన్సీ ప్రకారం సుమారు 73 లక్షల రూపాయలు పలకడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అక్షరాల 73 లక్షల రూపాయల విలువ చేసే ఈ చికెన్ ముక్క ప్రాముఖ్యత ఏమిటో ఎందుకు అంత ఖర్చు చేసే కొనాల్సి వచ్చిందో తెలుసుకుందాం.మెక్‌డోనాల్డ్స్ సంస్థ చికెన్ నగ్గెట్‌ను ‘అమాంగ్ అస్’ అనే ఓ వీడియో గేమ్ లోని ఒక పాత్ర ఆధారంగా తయారు చేశారు. ఇక ఈ గేమ్ అంటే ఇష్టపడే చికెన్ ప్రేమికులు ఎలాగైనా ఆ చికెన్ ముక్కను సొంతం చేసుకోవాలని తీవ్ర పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే ఉటాకు చెందిన పోలిజ్నా అనే వ్యక్తి రూ.72 లక్షలకు కొనుగోలు చేయడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…