Tag Archives: anganwadi worker owns property worth ₹4 crore

అంగన్ వాడీ కార్యకర్త వద్ద రూ.కోట్ల ఆస్తులు.. ఎక్కడ నుంచి వచ్చాయి..?

ఒక అంగన్ వాడీ కార్యకర్తకు నెలకు ఎంత సాలరీ ఉంటుంది.. దాదాపు రూ.20 వేలలోపు ఉంటుంది. అయితే ఒరిస్సాలోని భువనేశ్వర్ నగరంలోని కొరొడొకొంటా అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేసే కబితా మఠాన్ కార్యకర్త వద్ద కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఈ విషయం తెలిసిన చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక సాధారణ కార్యకర్త వద్ద అంత డబ్బు ఎక్కడిది అంటూ.. చర్చించుకుంటున్నారు.

అయితే ఆమె వద్ద ఆక్రమఆస్తులు కలిగి ఉన్నారనే ఆనోట.. ఈనోట కాస్త విజిలెన్సు అధికారువల వద్దకు వెళ్లింది. ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్లు తనిఖీలు చేపట్టడం మొదలు పెట్టారు. ఒరిస్సా లోని జగత్‌సింఘ్‌పూర్‌, కేంద్రాపడా, ఖుర్దా వంటి జిల్లాల్లో దాదాపు ఆరు ప్రదేశాల్లో ఆమెకు అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ సోదాలు జరిపిన వారిలో ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు, 10 మంది డీఎస్పీలు పాల్గొన్నారు. ఇంకా ఆమె అక్రమ సొమ్ముతో మొత్తం 4 భవానలు కలిగి ఉండగా.. విలువైన కార్లు, బంగారు ఆభరణాలు కూడా కలిగి ఉంది. వీటితో పాటు ఇళ్ల స్థలాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. జగత్‌సింఘ్‌పూర్‌ జిల్లాలోని తొలొకుసుమ ప్రాంతంలో 3 ఇళ్ల స్థలాలు, రూ.2.20 లక్షల విలువైన బీమా పొదుపు ఖాతాలు, రూ.6.36 లక్షలు విలువ చేసే 212 గ్రాముల బంగారం ఆభరణాలు.. ఖుర్దా జిల్లాలోని బలియంత ప్రాంతంలో ఒక ఇంటి స్థలం, ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇవన్ని ఎలా వచ్చాయనే వాటిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దాదాపు ఆమె వద్ద మొత్తం స్థిరాస్తులతో కలిపి రూ. 4 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. తనిఖీలో దొరికిన విలువైన వాటిని స్వాధీనం చేసుకొని.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.