ఒక అంగన్ వాడీ కార్యకర్తకు నెలకు ఎంత సాలరీ ఉంటుంది.. దాదాపు రూ.20 వేలలోపు ఉంటుంది. అయితే ఒరిస్సాలోని భువనేశ్వర్ నగరంలోని కొరొడొకొంటా అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేసే కబితా మఠాన్ కార్యకర్త వద్ద కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఈ విషయం తెలిసిన చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక సాధారణ కార్యకర్త వద్ద అంత డబ్బు ఎక్కడిది అంటూ.. చర్చించుకుంటున్నారు.
అయితే ఆమె వద్ద ఆక్రమఆస్తులు కలిగి ఉన్నారనే ఆనోట.. ఈనోట కాస్త విజిలెన్సు అధికారువల వద్దకు వెళ్లింది. ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్లు తనిఖీలు చేపట్టడం మొదలు పెట్టారు. ఒరిస్సా లోని జగత్‌సింఘ్‌పూర్, కేంద్రాపడా, ఖుర్దా వంటి జిల్లాల్లో దాదాపు ఆరు ప్రదేశాల్లో ఆమెకు అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ సోదాలు జరిపిన వారిలో ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు, 10 మంది డీఎస్పీలు పాల్గొన్నారు. ఇంకా ఆమె అక్రమ సొమ్ముతో మొత్తం 4 భవానలు కలిగి ఉండగా.. విలువైన కార్లు, బంగారు ఆభరణాలు కూడా కలిగి ఉంది. వీటితో పాటు ఇళ్ల స్థలాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. జగత్‌సింఘ్‌పూర్ జిల్లాలోని తొలొకుసుమ ప్రాంతంలో 3 ఇళ్ల స్థలాలు, రూ.2.20 లక్షల విలువైన బీమా పొదుపు ఖాతాలు, రూ.6.36 లక్షలు విలువ చేసే 212 గ్రాముల బంగారం ఆభరణాలు.. ఖుర్దా జిల్లాలోని బలియంత ప్రాంతంలో ఒక ఇంటి స్థలం, ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇవన్ని ఎలా వచ్చాయనే వాటిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దాదాపు ఆమె వద్ద మొత్తం స్థిరాస్తులతో కలిపి రూ. 4 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. తనిఖీలో దొరికిన విలువైన వాటిని స్వాధీనం చేసుకొని.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…