మూడు సంవత్సరాలుగా కాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేస్తోంది. సౌత్ టు నార్త్ అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ ఈ కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు ఓ జాడ్యం మాదిరిగా మారిపోయింది. 2018 లో మీటూ అంటూ ఈ ఉద్యమం దేశం మొత్తం షికార్లు కొట్టింది.
ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ధైర్యంగా బయటకు వచ్చి మరీ కాస్టింగ్ కౌచ్ గురించి చెపుతున్నారు. ఎవరు తమను ఇబ్బంది పెట్టారో చెబుతున్నారు. టాలీవుడ్ లో కూడా కొంతమంది నటీమణులు బయటకు వచ్చి చెప్పినప్పటికీ .. ప్రత్యేకంగా వాళ్లు ఎవరు అనేది బయట పెట్టలేదు. ఇదే విషయమై నటి శ్రీ రెడ్డి పెద్ద యుద్దమే చేసిన విషయం తెలిసిందే.
ఆ ఘటన తర్వాతే చాలామంది హీరోయిన్లు బయటకు వచ్చి తాము కూడా కాస్టింగ్ కౌచ్ కు గురైనట్లు చెప్పారు. ఈ విషయంలో కొంతమంది లొంగిపోవడంతో వేధింపులు ఎదురు కాలేదు అంటూ సెటైర్లు కూడా వేశారు. ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా అలనాటి తార ఇంద్రజ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఇదంతా కామన్ అని చెప్పిన ఇంద్రజ.. తాను ముక్కుసూటితనంతో వ్యవహరించడంతో పాటు ధైర్యంగా ఉండడంతో క్యాస్టింగ్ కౌచ్ నుంచి తప్పించుకోగలిగామని ఆమె తెలిపింది.
ప్రతీ రంగంలోనూ ఇలాంటిది ఉంటుందన్నారు. ఇది కామన్ అంటూ చెప్పుకొచ్చారు. ఒక ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు ఎక్కడకు వెళ్తున్నారు.. అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలను గమనించి.. ఏదైనా సమస్య ఉంటే.. పరిష్కరించుకోవాలని సూచించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…