సాధారణంగా మనం ఒకే చెట్టుకు ఒకేరకమైన కాయలు కాయడం ఇప్పటివరకు విని, చూసి ఉంటాం. కానీ మీరెప్పుడైనా ఒకే చెట్టుకు 40 రకాల కాయలు కాయడం విన్నారా.. అదేంటి ఒక చెట్టుకు 40 రకాల కాయలా? ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. ఇది సాధ్యమేనని ఒక అమెరికన్ రైతు నిరూపించాడు.
అమెరికాలో ఒకే చెట్టుకు 40 రకాల కాయలను సాగు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.అసలు ఇది ఎలా సాధ్యం అయ్యింది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…అమెరికాకు చెందిన సామ్ వాన్ అకెన్ రైతు ఈ అద్భుతాన్ని సృష్టించారు. ఆయన సైరక్యూస్ యూనివర్సిటీలో విజువల్ ఆర్ట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.
ఇతను సృష్టించిన చెట్టు.. రేగు, పీచ్, నేరేడు పండు, చెర్రీ వంటి వివిధ రకరకాల పండ్లను పండించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రొఫెసర్ అంటు కట్టే విధానం ద్వారా ఏకంగా 40 రకాల పండ్ల జాతికి చెందిన మొక్కలను అంటు కట్టి ఈ విధంగా ఒకే చెట్టులో 40 రకాల పండ్లను పండిస్తున్నారు.అయితే ఈ చెట్లు అంటు కట్టిన తర్వాత 9 సంవత్సరాలకు మొగ్గ రావడం జరిగిందని ప్రొఫెసర్ సామ్ తెలిపారు.
న్యూయార్క్ స్టేట్ అగ్రికల్చరల్ ఎక్స్‌పరిమెంట్ స్టేషన్‌లోని ఒక తోట గురించి తెలుసుకున్న ప్రొఫెసర్ అంటు కట్టే విధానం ద్వారా ఒక మొక్కను సృష్టించాలని భావించారు. ఈ క్రమంలోనే ఆ తోటను అద్దెకు తీసుకొని శిల్పం ద్వారా అంటుకట్టుట అనే ప్రయోగాలను ఏళ్ళ తరబడి చేస్తూ విజయం సాధించారు. అయితే ఈ అంటు కట్టే విధానంలో ప్రొఫెసర్ స్టోన్ ఫ్రూట్స్ మాత్రమే ఎంపిక చేసుకున్నారు. ఈ పండ్లను సింగిల్ కల్చర్ వ్యవసాయ పద్ధతులలో సాగు చేయవచ్చు ఈ విధానం ద్వారా రేగు, పీచు, నేరేడు, చెర్రీస్ వంటి 40 రకాల పండ్లను ఒకే చెట్టు ద్వారా పండిస్తున్నారు. అయితే ఇవన్నీ ఒకేసారి కాకుండా వేరు వేరు సమయాలలో కాస్తాయని అలా కాసే విధంగా ఆ చెట్టును సృష్టించానని ప్రొఫెసర్ సామ్ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…