Tag Archives: ap state

అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల.. ఇకపై అక్కడ కరోనా యాడ్..?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన తొలినాళ్లలో వైరస్ ను ఎలా కట్టడి చేయాలో తెలియక కేంద్రం దేశావ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేసింది. రెండున్నర నెలలు పూర్తిస్థాయి లాక్ డౌన్ ను అమలు చేసినా దేశంలో కరోనా కేసులను కట్టడి చేయడంలో కేంద్రం సక్సెస్ కాలేదు. లాక్ డౌన్ నిబంధనల వల్ల సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో కేంద్రం లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ వచ్చింది.

జూన్ నెల నుంచి అన్ లాక్ 1.0 సడలింపులు మొదలు కాగా కొన్ని రోజుల క్రితం కేంద్రం. అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం నుంచి అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదలయ్యాయి. జగన్ సర్కార్ రాష్ట్ర ప్రజలంతా గైడ్ లైన్స్ ను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం సూచనలు చేసింది. అన్ లాక్ 5.0 మార్గదర్శకాల వల్ల దాదాపు ప్రజల జీవనం సాధారణ స్థితికి చేరుకుందనే చెప్పాలి.

రాష్ట్రంలోని ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని మాస్క్ తప్పనిసరిగా వాడాలని జగన్ సర్కార్ పేర్కొంది. షాపింగ్ మాల్స్, షాపులు, సినిమా థియేటర్ల దగ్గర శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని వెల్లడించింది. ప్రార్థనా మందిరాల్లో, ప్రజా రవాణాలో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు కావాలని తెలిపింది. షాపింగ్ మాల్స్‌, థియేటర్లలో మాస్క్ లేకపోతే అనుమతులు ఇవ్వరాదని సూచనలు చేసింది.

ప్రత్యేక అధికారుల నియామకం ద్వారా కరోనా నిబంధనలు రాష్ట్రంలో అమలయ్యేలా చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపింది. సినిమా హాళ్లలో కరోనా యాడ్ ప్రసారం కావాలని వెల్లడించింది. బస్టాండ్, రైల్వే స్టేషన్ల ద్వారా ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. పరిశ్రమలు, విద్యా సంస్థల్లో కేంద్ర మార్గదర్శకాలను అమలు చేయాలని వెల్లడించింది.