Tag Archives: apprentice

నిరుద్యోగులకు ఈసీఐఎల్ శుభవార్త.. భారీ వేతనంతో అప్రెంటీస్ ఉద్యోగాలు..?

ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ‌ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 180 గ్రాడ్యుయేట్, డిప్లొమా అభ్యర్థుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 15వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది. https://careers.ecil.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.


ఆసక్తి ఉన్న బీటెక్, డిప్లొమా అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 180 ఉద్యోగ ఖాళీలలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్‌ ఉద్యోగాలు 160 ఉండగా డిప్లొమా అప్రెంటీస్ ఉద్యోగాలు 20 ఉన్నాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

https://portal.mhrdnats.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఏడాది శిక్షణ కాలంగా ఉంటుంది. 2018 ఏప్రిల్ 1వ తేదీ తర్వాత బీటెక్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు 2021 సంవత్సరం జనవరి 31 నాటికి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయో సడలింపులు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని ఎంపికైన వారికి నెలకు 9,000 రూపాయల చొప్పున వేతనం లభిస్తుంది. డిప్లొమా అభ్యర్థులకు కూడా ఇవే నిబంధనలు ఉండగా ఎంపికైన వారికి 8,000 రూపాయల వేతనం చెల్లిస్తారు. అర్హత పరీక్షలో మెరిట్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.