ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 180 గ్రాడ్యుయేట్, డిప్లొమా అభ్యర్థుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 15వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది. https://careers.ecil.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఆసక్తి ఉన్న బీటెక్, డిప్లొమా అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 180 ఉద్యోగ ఖాళీలలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్ ఉద్యోగాలు 160 ఉండగా డిప్లొమా అప్రెంటీస్ ఉద్యోగాలు 20 ఉన్నాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
https://portal.mhrdnats.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఏడాది శిక్షణ కాలంగా ఉంటుంది. 2018 ఏప్రిల్ 1వ తేదీ తర్వాత బీటెక్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు 2021 సంవత్సరం జనవరి 31 నాటికి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయో సడలింపులు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని ఎంపికైన వారికి నెలకు 9,000 రూపాయల చొప్పున వేతనం లభిస్తుంది. డిప్లొమా అభ్యర్థులకు కూడా ఇవే నిబంధనలు ఉండగా ఎంపికైన వారికి 8,000 రూపాయల వేతనం చెల్లిస్తారు. అర్హత పరీక్షలో మెరిట్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…